33.7 C
Hyderabad
April 29, 2024 01: 19 AM
Slider ప్రత్యేకం

చిన్నజీయర్‌ స్వామి దిష్టి బొమ్మలను తగలబెట్టాలి

chinnajiyar‌ swami dishti dolls should be burnt

త్రిదండి చిన్నజీయర్‌ స్వామి వన దేవతలైన సమ్మక్క- సారలమ్మలపై చేసిన కామెంట్లు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదేపిస్తున్నాయి. గతంలో త్రిదండి చిన్నజీయర్‌ స్వామి మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్‌ కావడంతో సమ్మక్క సారలమ్మలపై చేసిన కామెంట్లు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదేపిస్తున్నాయి. గతంలో త్రిదండి చిన్న జీయర్‌ స్వామి మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్‌ కావడంతో తాజాగా టీఆర్‌ఎస్‌ పార్టీ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీల ఆరాధ్య దైవాలు సమ్మక్క – సారలమ్మలను కించపరుస్తూ మాట్లాడిన చినజీయర్‌ క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు. ఆదివాసీ వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలను కోట్లాది మంది ప్రజలు కొలుస్తున్నారని ఆయన చెప్పారు. చినజీయర్‌ స్వామిలా మోసాలకు పాల్పడటం తమ జాతికి తెలియదని ఆయన పేర్కొన్నారు. ఆదివాసీల గూడేలలో చినజీయర్‌ దిష్టిబొమ్మలనను తగుల బెట్టాలని ఆయన పిలుపు నిచ్చారు. ఆదివాసీలకు క్షమాపణలు చేప్పే వరకు ఆయనను  విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు.

Related posts

నిరుపేదల పాలిట వరం.. సీఎంఆర్ఎఫ్ పథకం

Satyam NEWS

నీకై వేచితినోయి…

Satyam NEWS

యువతను బీజేపీ పార్టీలోకి ఆహ్వానించిన డా.కొత్తపల్లి శ్రీనివాస్

Satyam NEWS

Leave a Comment