28.7 C
Hyderabad
April 28, 2024 06: 14 AM
Slider పశ్చిమగోదావరి

మారు మూల పల్లెలకు చేరుతున్న చిరంజీవి ఆక్సిజన్

#chiranjeevi trust

పట్టణాలు పల్లెల్లో కాకుండా క్షేత్రస్థాయి గ్రామాలలో సైతం చిరంజీవి ట్రస్ట్ సేవలు చేరుతున్నాయి.

పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో నెగ్గిపూడి గ్రామానికి చెందిన గుగ్గిలపు రామాయమ్మ(82) కోవిడ్ బారినపడి ఆకస్మికంగా ఊపిరి తీసుకోవడం ఇబ్బందికరంగా మారడంతో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు తక్షణ సాయం అందించింది. తణుకు లోని చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు ద్వారా సిలిండర్ సకాలంలో అందించారు.

ఈ విషయాన్ని  షేక్ మహమ్మద్ అలీ తెలిపారు. ఆక్సిజన్ కావాలని అడిగిన వెంటనే నరసాపురం చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు ఇన్చార్జి కటకం రామకృష్ణ, ఆచంట నియోజకవర్గం ఆక్సిజన్ బ్యాంకు ఇంచార్జ్ వరికూటి కిషోర్ వెంటనే స్పందించి గంట వ్యవధిలోనే  ఆక్సిజన్ ఇప్పించారు.

కోవిడ్ పేషెంట్లకు గ్రామాలలోని క్షేత్రస్థాయిలో ఆక్సిజన్ ఇస్తూ చిరంజీవి ట్రస్టు ద్వారా సేవలందిస్తున్న రామ్ చరణ్ కుటుంబ సభ్యులకు, సకాలంలో అంబులెన్సు సైతం సమకూర్చిన మానవతా స్వచ్ఛంద సంస్థకు, స్పందించి సహకరించిన నెగ్గిపూడి ఒకటవ వార్డు సభ్యులు గుత్తుల సాల్మన్ దొరకు, రామాయమ్మ కుటుంబసభ్యులు, పంచ గ్రామ అభిమానులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Related posts

పెన్మత్స సురేష్‌బాబుకు ఎమ్మెల్సీ పదవి

Satyam NEWS

పెండింగ్ రిజిస్ట్రేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలి

Satyam NEWS

కరోనా ప్రోటోకాల్స్ పాటిస్తూ స్వాతంత్య్ర వేడుక‌లు

Satyam NEWS

Leave a Comment