40.2 C
Hyderabad
April 26, 2024 12: 37 PM
Slider ముఖ్యంశాలు

ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ సత్యాగ్రహం

#Indian Journalists

పాత్రికేయుల జీవితాలను చిదిమివేస్తున్న కరోనా నుండి భద్రతా కల్పించాలనే డిమాండుతో గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జర్నలిస్టులు సత్యాగ్రహం చేసి నిరసన తెలియజేశారు.

హైదరాబాద్ అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణా వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలో జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 12మంది జర్నలిస్టులు కరోనా కాటుకు బలైపోగా, 1100 మంది మీడియా సిబ్బందికి, 2,600మంది వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకింది.

అయితే మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయక చర్యలు లేకపోవడం విచారకరం… ఈ కార్యక్రమంలో హాజరయిన ఐజెయూ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కరోనా విజ్రుంభిస్తున్న సమయం నుంచి జర్నలిస్టులను కోవిడ్ వారియర్స్ గా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు.

గత నెలలో జరిగిన ఒక రోజు ఉపవాస దీక్షతో కూడా ప్రభుత్వం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని, దేశంలోని దాదాపు 12 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు జర్నలిస్టులకు భరోసా ఇస్తున్నాయని ఐజెయూ కార్యదర్శి నరేందర్ రెడ్డి అన్నారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టులు నిరసన ప్రదర్శన చేశారని..ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే ఆందోళనలు ఉధ్రుతం చేస్తామని తెలంగాణా రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం డిప్యూటీ జనరల్ సెక్రెటరీ విష్ణుదాస్ శ్రీకాంత్ హెచ్చరించారు.

బాధిత కుటుంబాలకు 50 లక్షల ప్రభుత్వ సహాయం అందించాలని, కోవిడ్ వారియర్స్ గా నిలిచిన జర్నలిస్టులకు 50లక్షల బీమా వర్తింపజేయాలని, కరోనా సోకిన జర్నలిస్టులకు కార్పోరేట్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్య సేవలు అందించాలనే డిమాండుతో ఐజెయూ పిలుపుతో సత్యాగ్రహంలో జర్నలిస్టులతో పాటు హైదరాబాద్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రియాజ్, శంకర్ గౌడ్, నగర నేతలు నాగరాజు గుప్తలతో పాటు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మేడ్చల్ అధ్యక్ష కార్యదర్శులు వెంకట్ రెడ్డి, బాలరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేష్, కెమెరా జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

వైసీపీ నేత ఆధ్వర్యంలో పేకాట డెన్

Bhavani

శాల్యూట్ టు ప్రకాశ్ రాజ్: మీరూ సాటివారిని ఆదుకోండి

Satyam NEWS

శీతాకాలం వ్యాధులకు సంజీవిని హోమియోపతి వైద్యం

Bhavani

Leave a Comment