40.2 C
Hyderabad
May 1, 2024 18: 12 PM
Slider ఆంధ్రప్రదేశ్

బేతాళుడి కథలా మారిన ఎన్నికల కమిషనర్ పదవి

#Circuler

హైకోర్టు తీర్పు దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు నిన్న జారీ చేసిన సర్య్కులర్ ను విత్ డ్రా చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ కార్యదర్శి నేడు ఉపసంహరించుకున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తాను చార్జి తీసుకుంటున్నట్లు డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ కోర్టు తీర్పును ఉటంకిస్తూ అందరు జిల్లా కలెక్టర్లకు, సంబంధిత అధికారులకు సర్క్యులర్ జారీ చేశారు.

ఆర్డినెన్సు నెం 5/2020ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసిందని, అంతే కాకుండా రిటైర్డ్ జస్టిస్ వి కనగరాజ్ ను నియమిస్తూ ఇచ్చిన ఆర్డర్లను కూడా హైకోర్టు రద్దు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగానే తాను తక్షణమే ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు సర్క్యులర్ లో పేర్కొన్నారు.

ఆయన పేరుతో విడుదలైన ఈ సర్క్యులర్ పై ఎన్నికల సంఘం కార్యదర్శి సంతకం చేశారు. అయితే ఈ సర్క్యులర్ ను రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం కార్యదర్శి నేడు ఏకవాక్య సర్క్యులర్ జారీ చేశారు.

సర్య్కులర్ నెం 317/SEC.A/2020 dt.29.05.2020 ని ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఉపసంహరించుకుంటున్నాను అని పేర్కొంటూ కార్యదర్శి సర్క్యులర్ ఇచ్చారు.  

Related posts

అంతిమయాత్రలో విషాదం.. 18 మంది మృతి

Sub Editor

500 కోట్లు ఇవ్వడానికి కేసీఆర్ కు చేతులు రాలేదు

Satyam NEWS

Analysis: వలసపోతున్న దేశ అభివృద్ధి

Satyam NEWS

Leave a Comment