28.7 C
Hyderabad
April 27, 2024 06: 22 AM
Slider సినిమా

`సీటీమార్` సెట్ లో త‌మ‌న్నాబ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌

tamanna1

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్నస్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘సీటీమార్. భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తెలంగాణ ఫీమేల్ క‌బ‌డ్డీ టీమ్ కోచ్జ్వాలారెడ్డిగా న‌టిస్తున్న స్టార్ హీరోయిన్‌ త‌మన్నా పుట్టిన‌రోజు డిసెంబ‌ర్ 21. ఈ సంద‌ర్భంగాసీటీమార్` సెట్‌లో త‌మ‌న్నా‌పుట్టినరోజు వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. యూనిట్‌ సభ్యుల నడుమ కేక్‌ కట్ చేసి బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసుకున్నారు త‌మ‌న్నా.

ఈ కార్య‌క్ర‌మంలో ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది, న‌టి భూమిక‌, చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి, స‌మ‌ర్ప‌కులు ప‌వ‌న్‌కుమార్‌, హీరోయిన్ దిగంగ‌న సూర్య‌వంశీతో పాటు చిత్ర యూనిట్ పాల్గొని త‌మ‌న్నాకు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుండి విడుద‌ల ‌చేసిన గోపీచంద్, త‌మ‌న్నాల లుక్స్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ రోజు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా స్టార్ హీరోయిన్‌ త‌మ‌న్నాస్పెష‌ల్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్‌. ఈ పోస్ట‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నఈ మూవీలో ప‌ల్లెటూరి అమ్మాయిగా ఒక ప్రత్యేక పాత్రలో హీరోయిన్ దిగంగ‌న న‌టిస్తుండ‌గా భూమిక కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ముఖ్యమైన పాత్రల్లో పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా న‌టిస్తున్నారు.

సినిమాటొగ్ర‌ఫి: ఎస్‌. సౌందర్‌ రాజన్‌
సంగీతం: మణిశర్మ‌,
ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు,
ఆర్ట్‌ డైరెక్టర్‌: సత్యనారాయణ డి.వై,
సమర్పణ: పవన్‌ కుమార్‌,
నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి,
కథ-మాటలు-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: సంపత్‌ నంది.

Related posts

ఇంటి పరిసర ప్రదేశాలని శుభ్రంగా ఉంచుకోవాలి

Satyam NEWS

మర్కజ్ క్లారిఫికేషన్: కన్ఫ్యూజన్ తప్ప కన్నింగ్ నెస్ లేదు

Satyam NEWS

బిజెపి నిరుద్యోగ మార్చ్‌ చేయటం సిగ్గుచేటు

Bhavani

Leave a Comment