39.2 C
Hyderabad
May 3, 2024 14: 44 PM
Slider గుంటూరు

సమస్యల సాధనకు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా

#CPMMangalagiri

గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. గత నాలుగు రోజులుగా మంగళగిరి పట్టణంలో ప్రచార యాత్ర జరిగింది. యాత్ర సందర్భంగా గా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను తీసుకొని పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేశారు.

పేదలకు ఇళ్లు ఇవ్వడంలో వైసీపీ నిర్లక్ష్యం

ఈ సందర్భంగా  సిపిఎం గుంటూరు తూర్పు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జె వి రాఘవులు మాట్లాడుతూ పట్టణంలో అందరికీ ఇళ్ల పథకంలో గత ప్రభుత్వం 1728 ఇల్లు నిర్మించిందని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు వైయస్సార్సీపి ప్రభుత్వం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు.

గత టిడిపి ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగితే విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలి గానీ, లబ్ధిదారులకు ఇళ్ల ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించడం ఏమిటని ప్రశ్నించారు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు, ఇల్లు వేసుకొని నివాసముంటున్న వారికి పట్టాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదని విమర్శించారు.

ఏం ఘనకార్యం చేశారని పాదయాత్రలు?

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి  పాదయాత్రలు చేస్తున్నారని ఏమి ఘనకార్యం చేశారని పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. 17 నెలల పాలన లో ఇంతవరకు ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని విమర్శించారు. మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తానని చెప్పి, ఆస్పత్రి స్థలాన్ని వేరే వారికి కేటాయించడం దారుణమన్నారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం బలపరుస్తుంది అన్నారు. దీనివలన ప్రజలపై అనేక భారాలు పడుతున్నాయన్నారు. సిపిఎం పట్టణ కార్యదర్శి ఎస్ ఎస్ చెంగయ్య మాట్లాడుతూ గండాలయం పేటలో ఇల్లు వేసుకొని నివాసముంటున్న వారికి పట్టాలు ఇస్తానని చెప్పి ఇంతవరకు ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయలేదని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి విమర్శించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు పి బాలకృష్ణ, వై కమలాకర్, కే ఏడుకొండలు, ఈ కాటమరాజు, వివి జవహర్లాల్, కె నాగేశ్వర్ రావు, ఎం బాలాజీ, డి రామారావు, పి రామచంద్ర రావు, జె  శివ భవ నారాయణ, ప్రజా సంఘాల నాయకులు ఎస్కే జానీ భాష, టి శ్రీనివాస రావు, పి జీవరాజు, ఎం వెంకటేశ్వరరావు, టి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వినతి పత్రం అందజేశారు.

Related posts

ఆర్మ్డ్ రిజర్వు పోలీసులకు పునశ్చరణ తరగతులు

Satyam NEWS

పెరేడ్: అధికార వికేంద్రీకరణతో పాలన మరింత చేరువ

Satyam NEWS

ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల పేరిట సైబర్ మోసాలు

Bhavani

Leave a Comment