38.2 C
Hyderabad
May 3, 2024 19: 18 PM
Slider ప్రత్యేకం

Glass Issue: ఢిల్లీకి చేరిన గుర్తు గోల

#JanasenaElectionSymbal

గ్లాస్‌ ఇష్యూను సీరియస్‌గా తీసుకున్నది బీజేపీ, జనసేన కూటమి…. చివరికి గ్లాస్‌ ఇష్యూపై సీఈసీకి బీజేపీ, జనసేన కూటమి ఫిర్యాదు చేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే జనసేన గుర్తు గాజు గ్లాసు.

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో జన సేన పోటీ చేయడం లేదు. తన మిత్ర పక్షమైన బిజెపికి మద్దతుఇస్తున్నది.

అయితే ఇంతలోనే ఒక చిక్కు వచ్చిపడింది. గ్లాసు గుర్తును అక్కడ నవతరం పార్టీ వారికి కేటాయించేశారు. ఆ పార్టీ అభ్యర్ధి ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించేశారు.

దాంతో తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలో నవతరం పార్టీకి గ్లాస్‌ గుర్తు కేటాయింపు తీవ్ర దుమారమే రేపుతోంది.

తమ గుర్తును వేరే వారికి ఇవ్వడంపై బిజెపి జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్టీ నేతలు జీవీఎల్‌, సునీల్‌ దేవ్‌ధర్‌, జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ సీఈసీని కలిసి ఫిర్యాదు చేశారు.

మరో పార్టీకి ఇచ్చిన గ్లాస్‌ గుర్తును రద్దు చేసి మరోటి ఇవ్వాలని కోరారు. స్థానిక సంస్థల్లో గ్లాస్‌ గుర్తు జనసేనకు ఇచ్చి, తిరుపతి బైపోల్‌లో వేరే పార్టీకి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు నాదెండ్ల మనోహర్‌.

పరిషత్‌ ఎన్నికలు, తిరుపతి బైపోల్‌తో జనంలో కన్ఫ్యూజన్‌ ఉందని, చర్యలు తీసుకోవాలని ఈసీని కోరామని బీజేపీ ఎంపీజీవీఎల్‌ తెలిపారు.

Related posts

తిరుమల తిరుపతి వెళ్లాలనుకుంటున్నారా? ఇది చదవండి

Satyam NEWS

వామ్మో ఇదేంటి? : టీఆర్ ఎస్ నేతల తిట్ల దండకం

Satyam NEWS

పి వి వాణికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి

Satyam NEWS

Leave a Comment