29.7 C
Hyderabad
April 29, 2024 08: 12 AM
Slider నల్గొండ

పరిసరాల పరిశుభ్రత డెంగ్యూ నివారణకు మార్గం

జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది డెంగ్యూ అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి ఎడిస్ ఈజిప్ట్( టైగర్ దోమ) కుట్టడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని, ఈ దోమ ముఖ్యంగా పగటి వేళల్లో కుడుతుందని,రానున్న వానాకాలం ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వలేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా ఇంటి పరిసరాలలో వాడిన కొబ్బరి బోండాలు టైర్లు,పగిలిన కుండలు,గాజు గ్లాసులు మొదలైన వాటిలో దోమలు పెరుగుతాయని,ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటించి నీటి తొట్టులను శుభ్రపరిచి ఆరబెట్టాలని సూచించారు.

డెంగ్యూ వ్యాధి నిర్ధారణ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలీషా టెస్ట్ ద్వారానే ఖచ్చితమైన నిర్ధారణ అవుతుందని ప్రజలు గుర్తించాలని కోరారు.డెంగ్యూ నివారణకు గాను ప్రజలు అందరూ చేయి చేయి కలిపి గ్రామంలో పారిశుద్ధ్యాన్ని పెంపొందించు కోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తరణాధికారి గజగంటి ప్రభాకర్,పి.హెచ్.ఎన్.నూర్జహాన్ బేగం, విజయలక్ష్మి,అలివేలు మంగ,జి.విజయ, సావిత్రి,స్వరూప,విజయ శ్రీ,ఝాన్సీ, మంగమ్మ,లలిత,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

శివనాగేశ్వరరావుగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని– దర్శకుడు సుకుమార్‌

Bhavani

తెలంగాణ వ్యతిరేకి వై ఎస్ కుమార్తెను తెలంగాణ ప్రజలు ఆహ్వానిస్తారా?

Satyam NEWS

ఆసరా పింఛన్లు బ్యాంకు సర్వీస్ ద్వారా అందించాలి

Sub Editor

Leave a Comment