39.2 C
Hyderabad
April 28, 2024 13: 01 PM
Slider మహబూబ్ నగర్

317 జీవో సమస్యల పరిష్కారానికి రాష్ట్రోపాధ్యాయ సంఘం నిరసన

#teachers

317 జీవో లోని అప్పీల్స్  పరిష్కరించాలని, బదిలీలు పదోన్నతులు చేపట్టాలని, బదిలీ లో 13 జిల్లాలను బ్లాక్ చేయడం వలన ఆయా జిల్లాలకు వెళ్లాల్సిన ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని రాష్ట్రోపాధ్యాయ సంఘం నిరసన వ్యక్తం చేసింది.

వెంటనే 13 జిల్లాలకు భార్య లేదా భర్తను బదిలీలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మ్యూచువల్ బదిలీలు వెంటనే పూర్తి చేయాలనే తదితర డిమాండ్లతో నాగర్ కర్నూల్ జిల్లా రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో  జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద నిరసన  కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సుదర్శన్ ప్రధాన కార్యదర్శి మురళి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శ్రీధరరావు రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఈశ్వర్  ఉపాధ్యక్షులు సతీష్ జిల్లా అసోసియేట్ లక్ష్మణరావు నాగర్ కర్నూల్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మధుసూదన్ రెడ్డి సురేష్ బాబు నరసింహ హనుమంత్ రెడ్డి రాజేష్ తాడూరు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ చారి కరుణాకర్ రెడ్డి రామేశ్వరరావు బిజినపల్లి మండల నాయకులు వెంకట్ స్వామి జిల్లా నాయకులు మల్లయ్య సత్యనారాయణ మురళీధర్ రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related posts

[Professional] Lower Diastolic Blood Pressure Naturally Fast What Helps Lower Diastolic Blood Pressure

Bhavani

కల్యాణ లక్ష్మీ చెక్కులను అందజేసిన కొల్లాపూర్ ఎమ్మెల్యే

Satyam NEWS

ఎలారమింగ్: దేశవ్యాప్తంగా మూతపడుతున్న పత్రికలు

Satyam NEWS

Leave a Comment