38.2 C
Hyderabad
April 28, 2024 22: 46 PM
Slider చిత్తూరు

చంద్రగ్రహణం కారణంగా టిటిడి స్థానిక ఆలయాల మూత

చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 8.30 గంట‌లకు టిటిడి స్థానికాల‌యాలైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం,శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్ప‌లాయిగుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యాల త‌లుపులు మూసివేశారు.

మ‌ధ్యాహ్నం 2.39 గంట‌ల నుండి సాయంత్రం 6.27 గంట‌ల వ‌ర‌కు చంద్ర‌గ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. కాగా, స్థానికాలయాల్లో ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం క‌ల్పించారు. రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి ఆలయశుద్ధి, కైంకర్యాలు నిర్వహిస్తారు.తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో రాత్రి 8 గంటల నుండి భ‌క్తుల‌ను స‌ర్వ‌ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. రాత్రి 8 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు అభిషేకం, రాత్రి 8.30 నుండి 10 గంట‌ల వ‌ర‌కు అలంకారం, స‌హ‌స్ర‌నామార్చ‌న‌, నివేద‌న‌, దీపారాధ‌న‌, రాత్రి 10 నుండి 10.15 గంట‌ల వ‌ర‌కు ఏకాంత సేవ నిర్వ‌హిస్తారు.

Related posts

రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Satyam NEWS

ఆది శంకరుడే అందరి గురువు: డా.అంతర్ముఖానంద

Satyam NEWS

ఆరోగ్య తెలంగాణే లక్ష్యం

Murali Krishna

Leave a Comment