31.2 C
Hyderabad
May 3, 2024 00: 30 AM
Slider సంపాదకీయం

అన్నయ్యా…! ఆ ఇద్దరికీ ఏమైందో కనుక్కున్నావా…?

#jagan

ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ పూర్తయ్యింది. కొందరికి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్వాసన పలికారు. మరి కొందరు కొత్త వారికి చోటు కల్పించారు. ఈ సందర్భంగా చెలరేగిన అసమ్మతిని కూడా ఏదోక విధంగా అదుపు చేశారు.

చాలా మంది మంత్రులు తమకు కేటాయించిన శాఖలకు సంబంధించిన బాధ్యతల స్వీకార కార్యక్రమం జోరుగా సాగింది. గత మూడు నాలుగు రోజుల నుంచి ఏపీ సచివాలయంలో మంత్రుల బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి సంబంధించిన సందడే కన్పిస్తోంది.

మొత్తం 25 మంది మంత్రులకు గానూ.. ఇద్దరు తప్ప అందరు మంత్రులూ బాధ్యతలను స్వీకరించారు. ఇంకొందరు మంత్రులు బాధ్యతలు స్వీకరించిన వెంటనే సమీక్షలు కూడా మొదలు పెట్టేశారు. అయితే…. ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది….. గత మంత్రి వర్గంలో ఉండి పునర్ వ్యవస్థీకరణలో కూడా పదవులు పొందిన వారు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అయితే మరింత విచిత్రంగా గత క్యాబినెట్ లో నిర్వహించిన ఆర్ధిక శాఖనే మళ్లీ పొందారు. గత మంత్రి వర్గంలో అత్యంత కీలకమైన మునిసిపల్ వ్యవహారాల శాఖ ను నిర్వహించి జగన్ కు తలలో నాలుకలా మెలిగిన బొత్స సత్యానారాయణకు మాత్రం ఆయనే కాకుండా ఎవరూ కూడా ఊహించని విధంగా విద్యా శాఖ దక్కింది.

మరి ఆ శాఖ ఆయనకు ఎందుకు ఇచ్చారో తెలియదు కానీ ఆయన మాత్రం ఇప్పటి వరకూ చార్జి తీసుకోలేదు. కేబినెట్‌లో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ  ఇంకా తన శాఖకు సంబంధించిన బాధ్యతలు తీసుకోకపోవడంతో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తనకు కేటాయించిన విద్యా శాఖ బాధ్యతలు స్వీకరించేందుకు బొత్స సుముఖంగా లేరనే చర్చ సచివాలయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తనకు మున్సిపల్ పరిపాలనా శాఖనే కేటాయించాలని బొత్స ఇప్పటికే సీఎం జగన్‌ని కోరినట్టు  ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారానికి తగ్గట్టే.. విద్యా శాఖపై ఇటీవల సీఎం నిర్వహించిన సమీక్షకు హాజరుకాలేదనే విషయం అందుకు బలాన్నిచ్చినట్లయింది. మున్సిపల్ శాఖ అయితేనే తనకు సౌకర్యంగా ఉంటుందని బొత్స భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.

మరికొన్ని రోజులు గడవగానే పూర్తి దృష్టి ఎన్నికల మీద పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొత్త శాఖ అవగాహన కల్పించుకుంటూ.. మరోవైపు ఎన్నికల మీద దృష్టి పెట్టడం కొంచెం కష్ట సాధ్యమైనా వ్యవహరమని బొత్స అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఇక ఎన్నికలు ముఖ్యం కాబట్టి.. శాఖను నిర్లక్ష్యం చేసి.. రాజకీయాలపై  దృష్టి కేంద్రీకరించలేక పోవడం సరైన విధానం కాదని బొత్స భావిస్తున్నారట. సీఎం తన మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగిస్తే.. దాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదనే చర్చ జరుగుతోంది. పాత మంత్రుల్లో కొద్ది మందికి అవే శాఖలు కేటాయించిన క్రమంలో తనకు కూడా అదే విధానాన్ని కొనసాగించి ఉంటే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాత్రం తనకు పాత శాఖనే కేటాయించినందున మళ్లీ చార్జి తీసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నారట. అదే శాఖ కొనసాగుతున్నా కూడా పాత మంత్రిగా రాజీనామా చేయడం, దాన్ని గవర్నర్ ఆమోదించడం, ఆ తర్వాత గవర్నర్ సమక్షంలో మళ్లీ ప్రమాణ స్వీకారం చేసినందున మళ్లీ చార్జి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఆయన మాత్రం అందుకు సుముఖంగా లేరట….. ఎందుకో తెలియదు.

Related posts

లంబాడాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్

Bhavani

అధికార పార్టీకి చెందిన రెండో ఎమ్మెల్యేకు పాజిటీవ్

Satyam NEWS

మ్యూజియంల రీఇమేజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించనున్న హైదరాబాద్

Satyam NEWS

Leave a Comment