33.7 C
Hyderabad
April 29, 2024 23: 09 PM
Slider ప్రత్యేకం

గృహలక్ష్మి పథకానికి 10 వరకే గడువు

#Grilahakshmi Scheme

సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి పథకం కింద అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ నెల పదో తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని తెలిపింది. వందశాతం రాయితీతో ప్రభుత్వం ఆర్థికసాయం అందించనుంది.నియోజకవర్గానికి 3000 చొప్పున లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం సాయం అందించనుంది. స్టేట్ రిజర్వ్ కోటాలో 43వేలు.. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మందికి గృహలక్ష్మి పథకం కింద లబ్ది చేకూరనుంది.

జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో, జీహెచ్ఎంసీలో కమిషనర్ ఆధ్వర్యంలో గృహలక్ష్మి అమలు కానుంది. వారే నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు. మహిళల పేరు మీదే గృహలక్ష్మి ఆర్థికసాయం అందిస్తారు. రెండు గదులు కూడిన ఆర్సీసీ ఇళ్లు నిర్మాణం కోసం ఆర్థికసాయం ఇవ్వనున్నరు. ఇంటి బేస్ మెంట్ లెవల్, రూఫ్ లెవల్, ఇళ్లు పూర్తి మూడు దశల్లో సాయం అందిస్తారు. ఆహార భద్రత కార్డు ఉండి సొంత స్థలం ఉన్న వారు అర్హులన్న ప్రభుత్వం.. ఇప్పటికే ఆర్సీసీ ఇళ్లు ఉన్న వారికి, 59 ఉత్తర్వు కింద లబ్ది పొందిన వారికి అవకాశం లేదని స్పష్టం చేసింది.

ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు పదిశాతం, బీసీ- మైనార్టీలకు 50 శాతానికి తగ్గకుండా లబ్ధిదారులను ఎంపిక చేయాలని తెలిపింది. జిల్లాల వారీగా దరఖాస్తులను పరిశీలించి కలెక్టర్ అర్హులను ఎంపిక చేస్తారు. ఎవరైతే ఈ పథకానికి అర్హత సాధిస్తారో వారికి మంత్రి ఆధ్వర్యంలో జిల్లా ఇన్ఛార్జ్లు ఈ పథకం వర్తింపు చేస్తారు.

ఆర్థికసాయం అందించగా మిగిలిన వారిని వెయిటింగ్ లిస్ట్లో పెట్టి భవిష్యత్లో ఆర్థికసాయం అందిస్తారు. అధికారులు లబ్దిదారులను పరిశీలించి జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆమోదం పొందిన అనంతరం బ్యాంక్ ఖాతాల్లో నగదు వేయనున్నారు. దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, ఇంటి స్థలం దస్తావేజులు, సహా ఇతరపత్రాలను జత చేయాల్సి ఉంటుంది. ఈ నెల పదో తేదీ వరకు మీసేవ ద్వారా సదరు కార్యాలయాల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పది రోజుల్లోగా వాటిని పరిశీలించి ఇళ్లను మంజూరు చేయనున్నారు.

Related posts

గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Satyam NEWS

ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి కార్పొరేషన్ పదవి

Satyam NEWS

శ్రీవారి ఆస్తులు అమ్మే హక్కు మీకు ఎక్కడిది?

Satyam NEWS

Leave a Comment