33.7 C
Hyderabad
April 29, 2024 00: 18 AM
Slider గుంటూరు

ఫీజులు గుంజుతున్న ప్రయివేటు ఆసుపత్రులపై చర్య

#MIM

అధిక మొత్తంలో కరోనా ఫీజు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాని MIM పార్టీ, బీసీ సంఘం, మాల మహానాడు, BSP డిమాండ్ చేశాయి.

గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో నేడు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. కరోనా కేసులకు లక్షల్లో ఫీజులు గుంజుతున్న ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించారు.

నాన్ క్రిటికల్ కరోనా పెషేంట్ వద్ద వైద్యానికి రోజుకి రూ.3,250, క్రిటికల్ కోవిడ్19 పేషంట్లకు ఐసీయూలో వెంటిలెటర్లు ఎన్ఐవి లేకుండా ఉంచితే రోజుకి రూ. 5,480, ఎన్ఐవితో ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తే రోజుకి రూ.5,980, వెంటిలేటర్ పెట్టి వైద్యం అందిస్తే రోజుకి రూ.9,580 మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని వారు గుర్తు చేశారు.

ఇన్ఫెక్షన్ ఉన్నవారికి వెంటలేటర్ లేకుండా వైద్యం అందిస్తే  రోజుకి రూ.6,280, ఇన్ఫెక్షన్ ఉండి వెంటిలేటర్ వైద్యం అందిస్తే రోజుకి రూ.10,380 మాత్రమే వసూలు చేయాలనీ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని వారు తెలిపారు.

అయితే ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. సామాన్య ప్రజలు ఉన్న ఆస్తులు సైతం అమ్ముకొని హాస్పటల్స్ యాజమాన్యలకు కట్టే పరిస్థితి ఉందని వారు తెలిపారు.

ఇప్పుడైనా సంబంధిత అధికారులు కల్పించుకొని కరోనా బాధితులను కాపాడలని MIM పార్టీ నాయకులు కోరారు.

ఈ కార్యక్రమం లో MIM పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి SK మస్తాన్ వలి, పట్టణ అధ్యక్షుడు మౌలాలి, మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోదా జాన్ పాల్, BSP జిల్లా కో ఆర్డినటర్ బుదాల బాబురావు, బిసి సంగం నాయకులు కటారి శివరామకృష్ణ, మాలమహనాడు  రాష్ట్ర మహిళ నాయకురాలు మల్లెల అనిల, జి మణిక్యరావు తదితరులు పాల్గొన్నారు.

ఎం ఎస్ సుధాకర్, సత్యం న్యూస్

Related posts

అమెరికాలో కొలువుదీరిన “కూచిపూడి పలావ్”

Satyam NEWS

హైదరాబాదులో అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం

Satyam NEWS

చౌకబియ్యం పాలిష్ చేసి దొంగ మార్కెట్ కు తరలింపు

Satyam NEWS

Leave a Comment