37.2 C
Hyderabad
May 2, 2024 14: 59 PM
Slider విజయనగరం

సీఎం పర్యటనకు జల్లెడపడుతున్న పోలీసులు

#depika

మెంటాడలో మ్యాన్ ప్యాక్ ,వాకీ టాక్ తో  సీఎం జగన్ కాన్వాయ్ పరిశీలన

సీఎం జగన్ 25న విజయనగరం జిల్లా మెంటాడ మండలం చినమేడపల్లి లో కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ కి శంకుస్థాపన చేయనున్న సంగతి విదితమే. ఇందుకు సంబంధించి గత రెండు రోజుల నుంచీ భద్రతా ఏర్పాట్లను దగ్గరుండి జిల్లా ఎస్పీ దీపికా పరిశీలిస్తున్నారు. తాజాగా హెలిప్యాడ్ నుంచీ శంకుస్థాపన చేయనున్న ప్రదేశాల వద్ద అణువణువునా పోలీసులు జల్లెడ పట్టారు. జిల్లా ఎస్పీ దీపిక ఘటనా స్థలి వద్దే మ్యాన్ ఫ్యాక్, వాకీ టాక్ తో భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు.

అలాగే సీఎం కాన్వాయ్ ని కూడా సిబ్బంది తో ట్రయిల్ రన్ వేసి చూసారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  మెంటాడ మండలం పెద మేడపల్లి లో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణ పనులకు శంఖు స్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో సభా స్థలం, శంఖు స్థాపన జరిగే ప్రాంతం, హెలిప్యాడ్, రూట్ బందోబస్తు, కాన్వాయ్, ట్రాఫిక్ రెగ్యులేషన్, రూఫ్ టాప్, వాహనాల మళ్లింపు, పార్కింగ్ స్థలాలు వద్ద  ట్రయల్ రన్ ను జిల్లా ఎస్పీ ఎం.దీపిక పర్యవేక్షించారు.

అలాగే బందోబస్తు విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బందికి వారు నిర్వహించే విధులుపైన, చేపట్టాల్సిన భద్రత చర్యలపై బ్రీఫ్ చేశారు.జిల్లా ఎస్పీ తో పాటు అదనపు ఎస్పీలు  అస్మా ఫర్హీన్,  అనిల్ పులిపాటి,  మణికంఠ, పలువురు డీఎస్పీలు, సిఐలు, ఎసైలు సిబ్బంది ఉన్నారు.

Related posts

జాగ్రతలు తీసుకోండి సైబర్ నేరస్తుల బారిన పడకండి

Satyam NEWS

లంపి వైరస్ తో మృతిచెందిన పశు యజమానులకు పరిహారం

Satyam NEWS

నరసరావుపేటలో ఘనంగా వంగవీటి జయంతి వేడుకలు

Satyam NEWS

Leave a Comment