37.2 C
Hyderabad
May 2, 2024 14: 26 PM
Slider మహబూబ్ నగర్

గిరిజన జాతిని మోసం చేసిన సీఎం కేసీఆర్

#BangaruShruthi

వనపర్తి మండలం చిట్యాల తూర్పు తాండాలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి బంగారు శృతి  ముఖ్యఅతిథిగా పాల్గొని బీజేపీ  జెండా ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా  కార్యకర్తలు  తండా వాసులను ఉద్దేశించి బంగారు శృతి  మాట్లాడుతూ దళితుడిని సిఎం చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ తీరా ఎన్నికల్లో గెలిచాక దళితులను మోసం చేసి తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి  అయ్యాడని విమర్శించారు.

గతంలో గిరిజనులకు ఆరు శాతం ఉన్న రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతామని ఎన్నికల్లో  హామీ ఇచ్చి ఎన్నికలు అయిపోయాక ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టడమే కాకుండా  కేంద్రం రిజర్వేషన్లను అమలు  లేదని బిజెపిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో  నా ఆద్వర్యంలో రాష్ట్రం నుంచి బిజెపి డెలిగేషన్ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  గిరిజన రిజర్వేషన్ల ప్రతిపాదన కేంద్రానికి పంపుతూ దానికి లింకుపెడుతూ ముస్లింలకు 10% రిజర్వేషన్ ప్రతిపాదన కూడా కేంద్రానికి పంపాడని అన్నారు.

సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు మతపరమైన రిజర్వేషన్ చెల్లదని తెలిసినా ముస్లింలకు,గిరిజనులకు లింకుపెట్టి గిరిజనులను మోసం చేస్తున్నాడని వచ్చే ఎన్నికల్లో గిరిజనజాతి పూర్తిగా ఏకతాటిపై నిలిచి మాయలమరాటి కెసిఆర్ ను గద్దెదింపాలని కోరారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధికార పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీ అని రాష్ట్ర ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. మొన్న జరిగిన దుబ్బాక జిహెచ్ఎంసి ఎన్నికల అందుకు నిదర్శనమని భవిష్యత్తులో రానున్న వరంగల్ ఖమ్మం సిద్దిపేట నాగార్జునసాగర్ ఎన్నికల్లో కూడా బిజెపి జెండా ఎగరడం ఖాయమని అందుకు ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు డా.ఎద్దుల రాజ వర్ధన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీ క్రిష్ణ సబి రెడ్డి వెంకట్ రెడ్డి, ఓ బి సి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బి.శ్రీశైలం, జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ జింకల కృష్ణయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు కుమారస్వామి, కోశాధికారి భాశెట్టి శ్రీను జిల్లా అధికార ప్రతినిధి పెద్దిరాజు, అసెంబ్లీ మాజీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్,

సీనియర్ నాయకులు చిత్తారి ప్రభాకర్, పూరి సురేష్ శెట్టి, జనంపల్లి మహేందర్, నరేష్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి  రాములు, మండల ప్రధాన కార్యదర్శి  శ్రీనివాసులు, జాతీయ అధ్యక్షుడు కాటమోని శ్రీనివాస్ గౌడ్, సిరియాల శ్రీనివాసులు, మామిళ్ళపల్లి రాయన్న, మామిళ్ళపల్లి విజయ్ కుమార్, నాయక్, రవి నాయక్,  తిరుపతి నాయక్, శంకర్ నాయక్ , బాలు, వెంకటేష్ మోహన్, రాయుడు, హనుమంతు పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

మహిళల భద్రతే ప్రభుత్వ లక్ష్యం

Sub Editor 2

కార్మికులు, ఆశా, అంగన్వాడీ, జూనియర్ డాక్టర్ల ను పర్మినెంట్ చేయాలి

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

Satyam NEWS

Leave a Comment