31.7 C
Hyderabad
May 2, 2024 10: 41 AM
Slider ఖమ్మం

మహిళల భద్రతే ప్రభుత్వ లక్ష్యం

safety of women is the goal of the government

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకై ప్రత్యేక చర్యలు తీసుకుందని, షిటీమ్ పోలీస్ ను ఎర్పాటు చేసి పటిష్ట పోలీస్ భద్రత ను కల్పించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పేర్కొన్నారు. మహిళల భద్రత & లింగ సమానత్వం గురించి అవగాహన కల్పించేందుకు  ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నుండి లకారం ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన షీ-టీమ్స్ రన్ ను పువ్వాడ  ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా  షీ-టీమ్ లు పని చేస్తున్నాయన్నారు.   గతంలో లాగా మహిళలపై ఆకతాయిలు, పోకిరీల అగాయిత్యలు, చోరీలు తగ్గిపోయాయని, నేరగాళ్లకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఅర్  తీసుకున్న కఠినమైన నిర్ణయాల వల్లే  సాధ్యమైందన్నారు.

సుస్థిరమైన రేపటి కోసం ఈ రోజు లింగ సమానత్వం’ అనే థీమ్‌కు అనుగుణంగా, ఖమ్మం పోలీస్ శాఖ షీ-టీమ్‌ ఆధ్వర్యంలో జెండ‌ర్ ఈక్వాలిటీ 2కే, 5కే ర‌న్‌ను నిర్వ‌హించ‌డం అభినందనీయమన్నారు. ఖమ్మంకు పోలీస్ కమిషనరేట్ తీసుకురావాలని నాడు అనేక మార్లు ముఖ్యమంత్రి కేసీఅర్ గారి దృష్టికి తీసుకెళ్ళి సాదించుకున్నామన్నారు. సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను పెంచటం వల్లే నేరాలను అదుపులో ఉంచగలిగామన్నారు. అందుకు కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మ‌హిళ‌ల‌కు నిరంత‌రం ర‌క్ష‌ణ క‌ల్పిస్తుందని ఈ సందర్భంగా అన్నారు. అనంతరం మహిళల భద్రత మరియు లింగ సమానత్వం గూర్చిన ప్రచారాన్ని ఈ రన్ ద్వారా నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. అనంతరం రన్ పూర్తి చేసిన వారిని ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

కార్యక్రమంలో  మేయర్ పునుకొల్లు నీరజ , సుడా చైర్మన్ విజయ్ గ, జిల్లా కలెక్టర్ VP గౌతం , పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ , మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి , అదనపు DCPలు గౌస్ అలం, పూజ , సుభాష్ చంద్ర బోస్, ACP లు స్నేహామెహ్రా , ఆంజనేయులు , రామోజీ రమేష్ , విజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాజంపేటలో వికేంద్రీకరణకు మద్దతుగా క్యాండిల్ ర్యాలీ

Satyam NEWS

మింగుతున్న చైనా… తప్పుకున్న అమెరికా…. మునుగుతున్న భారత్

Satyam NEWS

విద్యాశాఖలో సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ

Bhavani

Leave a Comment