30.7 C
Hyderabad
April 29, 2024 06: 31 AM
Slider పశ్చిమగోదావరి

అనాథలా మారిపోయిన మినీ కొల్లేరు సరస్సు

#kolleru

ఏలూరు జిల్లా పెదవేగి మండలం మండూరు లో మైనర్ ఇరిగేషన్ శాఖకు చెందిన సుమారు 300 ఎకరాల విస్తీర్ణం లో ఉన్న కన్న సముద్రం చెరువులో తుమ్మచెట్లు మాయమై పోతున్నాయని కొంతమంది గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులకు తెలిసినా తెలియ  నట్టు గా వ్యవహరిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఈ చెరువు లో కొంత భాగం ఆక్రమణలకు గురై సాగు భూమిగా మారిపోయిందని అనుకుంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కన్న సముద్రం చెరువు లో సుమారు 50 ఎకరాల వరకు ఆక్రమణల పాలైందని సమాచారం. సంబంధిత అధికారులు ఆక్రమణలకు గురైన చెరువు తో బాటు చెరువులో ఉన్న తుమ్మ చెట్లను కూడా పరిరక్షిస్తే కొన్ని రకాల పక్షి జాతులు తలదాచుకునే   వీలుంటుందను ప్రజలు అభిప్రాయం పడుతున్నారు.

సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని మండూరు ప్రజలు కోరుతున్నారు. మండూరు లో 300 ఎకరాల విస్తీర్ణం గల కన్న సముద్రం చెరువును అప్పటి మైనర్ ఇరిగేషన్ శాఖ మంత్రి మాగంటి బాబు, అప్పటి జలవనరుల శాఖ స్పెషల్ అధికారి చెరుకూరి శ్రీధర్ సంబంధిత శాఖల అధికారులతోకలిసి మండూరు కన్న సముద్రం చెరువును మినీ కొల్లేరుగా తీర్చి దిద్దాడానికి ప్రణాళికలు రూపొందించి అప్పట్లో కోటి రూపాయకు పైగా నిధులు కూడా మంజూరు చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ చెరువు పరిస్థితిని స్థానిక శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరితో కలిసి జిల్లా స్థాయి అధికారులు ఒకసారి పరిశీలించాలని కొంత మంది చెరువు ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

Related posts

టీటీడీ కి “జీఎస్టీ” మినహాయింపు ఇవ్వాలి!

Satyam NEWS

చిత్తూరు జాతీయ రహదారిపై నలుగురి మృతి

Satyam NEWS

ఒకే ఒక్కడు

Satyam NEWS

Leave a Comment