38.2 C
Hyderabad
April 29, 2024 21: 22 PM
Slider ముఖ్యంశాలు

సిఎం రిలీఫ్ ఫండ్ కు ముఖ్యమంత్రి కార్యాలయం బ్రేక్

#Y S Jaganmohan Reddy

ఎంతో కాలంగా ఎందరో ముఖ్యమంత్రుల హయాం నుంచి కొనసాగుతున్న ముఖ్యమంత్రి సహాయ నిధి పథకానికి బ్రేక్ పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద వర్గాలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడిన సందర్భంలో వారికి ఎం ఎల్ ఏలు ఎంపిలు సిఫార్సు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్ధిక సహాయం ఇప్పించడం పరిపాటి.

చాలా ఏళ్ల నుంచి ఈ పథకం నిరాఘాటంగా కొనసాగుతున్నది. సిఎం ఆర్ ఎఫ్ కు ప్రభుత్వం ఏటా సుమారు రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నది. అయితే ఆరోగ్య శ్రీ లో ఉన్న వ్యాధులకు సిఎంఆర్ఎఫ్ నిధులు ఇచ్చేది లేదంటూ సిఎంవో తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక మంత్రులు ఎమ్మెల్యేలు కూడా లేఖలు పంపవద్దని సూచించింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 2434 జబ్బులకు చికిత్స చేస్తున్నట్లు  సీఎంఓ వెల్లడించింది. డి సెంబరు ఒకటి నుంచి సీఎం ఆర్ ఎఫ్ కింద క్లయింలు స్వీకరించడం లేదని సీఎంఓ స్పష్టం చేసింది.

Related posts

4730మందికి లైసెన్స్ లు పంపిణి

Bhavani

పోలీసు చొక్కాలు తీసేసి రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయండి

Satyam NEWS

స్ఫూర్తి జితేందర్ “ఐ ఫీల్ యు” ఆల్బమ్ పోస్టర్ ఆవిష్కరణ

Bhavani

Leave a Comment