పేదల ఆరోగ్య పరిరక్షణకు సీ.యం.సహాయనిధి దోహదపడుతుందని ఎల్.బి.నగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్..ఫేస్..3..కాలనీకి చెందిన మనోహర్ రావు కడుపునొప్పి సమస్యలతో బాధపడుతూ చికిత్స చేసుకున్నారు. ఆర్ధిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల ఆయన కుటుంబ సభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని సంప్రదించారు.
వెంటనే స్పందించిన సుధీర్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 35,000 మంజూరు చేయించారు. నేడు ఆ చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందచేశారు. ఈ పథకం పేదలకు ఓ వరం లాంటిది అని దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన అధునాతన వైద్య సేవలను పొందేందుకు సీ.ఎం. సహాయ నిధి అండగా ఉంటుంది అని అన్నారు. ఎల్. బి.నగర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ సభ్యులు మొద్దు లచ్చిరెడ్డి, నియోజకవర్గ పరిధిలో పలువురు కార్పొరేటర్లు జిట్టా రాజశేఖర్ రెడ్డి, ముద్రబోయిన శ్రీనివాసరావు, సాగర్ రెడ్డి, కొప్పుల విఠల్ రెడ్డి, భవాని ప్రవీణ్ కుమార్, పద్మ నాయక్ పాల్గొన్నారు.