32.7 C
Hyderabad
April 27, 2024 01: 54 AM
Slider ఆదిలాబాద్

రైతుల్లో ధైర్యం నింపేందుకే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

Indrakaran reddy

రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనే పూచి ప్రభుత్వానిదేనని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖమాత్యులు ఎస్. నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం మామడ మండలం లోని ఫోన్కాల్ గ్రామంలో మార్కెట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం రాష్ట్ర అటవీ, పర్యావరణం, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ మానవాళి కరోనా వైరస్ ప్రభావంతో పెను విషాదం ఎదుర్కొంటోందని, ఈ తరుణంలో రైతుల మనోధైర్యం కోల్పోకుండా వారిలో ఆత్మ విశ్వాసం పెంపొందించేందుకు, రైతులు ఇబ్బందులకు కలగకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు.

 రైతులు పండించిన పంటలు తక్కువ రేటుకు వ్యాపారులు దళారులు కొనకూడదనే భావంతో ఆపద సమయంలో రైతులను ఆదుకోవాలని సంకల్పంతో సూక్ష్మస్థాయిలో ప్రణాళిక రూపొందించామన్నారు. రాష్ట్రంలో 5 లక్షల 92 వేల ఎకరాల్లో మక్కా సాగు జరిగిందని తెలిపారు.

నిర్మల్ జిల్లాలో 80 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయిందన్నారు. 40 లక్షల ఎకరాల్లో వరి సాగు అయిందన్నారు. పౌరసరఫరాల శాఖ ఐకేపీ, పిఎసిఎస్, మార్క్ఫెడ్ ద్వారా కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని అన్నారు. కరోనా ప్రభావంతో పౌల్ట్రీ రంగం కుదేలు అయిందన్నారు.

రాష్ట్రంలో 5.92 లక్షల ఎకరాల్లో పంట సాగు అయిందని 14 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న వస్తుందని, దీనికి 3213 కోట్లు రూపాయలు చెల్లించవలసి ఉంటుందని అంచనా వేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1077 మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు.

నిర్మల్ జిల్లాలో 91 కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. క్వింటాలుకు కనీస మద్దతు ధర1760/- చెల్లించనున్నట్లు తెలిపారు. రైతులు పండించిన ప్రతిదాని ధాన్యపు గింజను కొనే పూచీ ప్రభుత్వానిదే అన్నారు. సేద్యానికి వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని అన్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్న దృశ్య రైతులు అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని, మనిషికి మనిషికి మధ్య మూడు అడుగుల సామాజిక దూరం పాటించాలని, పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వం సూచించిన విధంగా ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలన్నారు.

 ప్రభుత్వం రైతుల వెంట ఉందనడానికే ప్రతి దినం రైతుల మధ్యనే ఉన్నట్లు మంత్రి తెలిపారు. మంత్రి అంతకుముందు రాయ దారి గ్రామంలో తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ, వలస కూలీల కు 30 మందికి 500 చొప్పున పంపిణీ చేశారు.

మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోని 205 దేశాల్లో కరోనా వైరస్ ప్రబలిందని ప్రజలంతా వ్యాధి వ్యాప్తి చెందకుండా సామాజిక దూరం పాటించాలన్నారు. నిర్మల్ జిల్లాలో చెన్నై వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారని 24.56 లక్షల  క్వింటాల్ ల దిగుబడి రాబోతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ రాథోడ్ జనార్దన్ , డి సి సి బి చైర్మన్ నాందేవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవొతు రాజేందర్, జిల్లా ఎస్పీ శశిధర్ రాజు, జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు, డి సి సి బి డైరెక్టర్ హరీష్ రావు రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ వెంకట్రాంరెడ్డి, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రిక్వెస్టు: ప్రభుత్వ చర్యలకు ప్రజలు సహకరించాలి

Satyam NEWS

రోడ్డు ప్రక్కన చిరు వ్యాపారులపై అక్రమ చలాన్ల వసూలు నిలిపివేయాలి

Satyam NEWS

కంటివెలుగు అమలు తీరుతెన్నులు భేష్

Bhavani

Leave a Comment