28.7 C
Hyderabad
April 28, 2024 06: 40 AM
Slider జాతీయం

ప్రధాని టూర్ పై అతిగా స్పందన : చన్నీ

ప్రధాని పంజాబ్‌ పర్యటనలో తలెత్తిన భద్రతా లోపంతో రాజకీయ రగడ రాజుకుంటోంది. నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో వాతావరణం వేడెక్కుతోంది. ముమ్మాటికీ ఇది భద్రతా వైఫల్యమేనని బీజేపీ ఆరోపిస్తుంటే.. కాంగ్రెస్‌ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు.

కాగా ఈ వివాదంపై పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణజీత్ సింగ్ చన్నీ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో ఎలాంటి భద్రతా వైఫల్యాలు లేవన్నారు. బీజేపీ నాయకులు కావాలనే తమ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చివరి నిమిషంలో ప్రధాని మోడీ రోడ్డుమార్గంలో వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం వల్లే ఇది జరిగిందన్నారు. భద్రతను సాకుగా చూపి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని సీఎం ఆరోపించారు.

‘ప్రధానిని నేను ఎంతో గౌరవిస్తాను. అభిమానిస్తాను. ఆయనకు ఏదైనా ఆపద కలిగితే నేనే ముందు ఉంటాను. ఒకవేళ ప్రధానిపై బుల్లెట్ పేల్చితే  నేనే ముందుగా ఎదురెళతాను. త్వరలో రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఎలాంటి అవకాశం లేదు. అందుకే ప్రధాని భద్రతా లోపాన్ని సాకుగా తీసుకుంటోంది. మోఢీ పంజాబ్‌ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. కేంద్రం కావాలనే ఈ ఘటనను అతిగా ప్రచారం చేస్తోంది.

కేవలం రైతుల నిరసనలతోనే ప్రధాని పర్యటనకు ఆటంకం కలిగింది. ఇందుకు నేను కూడా ఎంతో చింతిస్తున్నాను. కానీ బీజేపీ నాయకులు మాత్రం జాతీయవాదం, భద్రతా ఉల్లంఘనల పేరుతో పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ప్రధాని హెలికాప్టర్‌లో సభకు వెళ్లాలి. కానీ చివరి నిమిషంలో తమ ప్రణాళికలు మార్చుకున్నారు.

ప్రధాని రోడ్డు మార్గంలో వస్తున్నారనే విషయం నిరసనకారులకు తెలియదు. వారు మోఢీ కాన్వాయ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. ఈ పర్యటనలో ప్రధాని ప్రాణాలకు వచ్చిన ముప్పేమీ లేదు. భద్రతా పరంగా మా ప్రభుత్వం, అధికారులు ఎలాంటి తప్పు చేయనప్పటికీ కేంద్రం ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం దారుణమని అన్నారు. ‘ప్రధాని పంజాబ్‌ పర్యటనకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.

Related posts

ప్రకాశం బ్యారేజ్ కు కొనసాగుతున్న వరద

Satyam NEWS

కార్యకర్తల బలమే నా బలం: డిప్యూటీ స్పీకర్ కోలగట్ల

Satyam NEWS

విజయవాడలోనే ఉండి ఎన్నికలు పర్యవేక్షించనున్న నిమ్మగడ్డ

Satyam NEWS

Leave a Comment