29.7 C
Hyderabad
May 2, 2024 05: 31 AM
Slider తెలంగాణ

గ్రీన్ ఛాలెంజ్: మొక్కలు నాటిన కాగ్నిజెంట్ హెడ్

cognigent

సైబరాబాద్ పోలీసు కమిషనర్  వి సి సజ్జనార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నామినేట్ చేసిన కాగ్నిజెంట్ హైదరాబాద్ డిజిటల్ ఆపరేషన్స్ హెడ్ ప్రశాంత్ నాదెళ్ల నేడు మొక్కలు నాటారు. హైదరాబాద్ లోని గోల్డెన్ తులిప్ పార్క్ లో ఆయన మొక్కలు నాటిన అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని తన సహచరులు కాగ్నిజెంట్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అనూప్ నాయర్, సీనియర్ డైరెక్టర్ సిద్దార్ధ్ మహేశ్వరి, డైరెక్టర్ చింతా సుబ్రహ్మణ్యం లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ  కాగ్నిజంట్ సంస్థ పర్యావరణానికి సంబంధించి కార్యక్రమాలలో అంకితభావంతో పని చేస్తుందని అందులో భాగంగానే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నామని తెలిపారు. ఈ పార్కులో తమ సిబ్బంది ఇప్పటికే 300 కంటే ఎక్కువ మొక్కలు నాటారని ఆయన తెలిపారు. హైదరాబాద్ ప్రజలకు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కు ఎంతో అవసరమైన పచ్చదనం, తాజా గాలిని అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.

Related posts

కమలం కల నెరవేరేనా?

Satyam NEWS

ఘనంగా లంబాడీల ఆరాధ్యదైవం శీతల పండుగ

Satyam NEWS

Good News: రష్యా ఉక్రెయిన్ మధ్య కుదిరిన ఒప్పందం

Satyam NEWS

Leave a Comment