31.7 C
Hyderabad
May 2, 2024 08: 27 AM
Slider శ్రీకాకుళం

హోళీ ట్రాజెడీ: సముద్రంలో మునిగి యువకుడి మృతి

holi tragedy

హోలీ పండుగ సందర్భంగా సముద్ర స్నానానికి వెళ్లిన ఒక యువకుడు మరణించాడు. శ్రీకాకుళం పట్టణం మంగు వారి తోటకు చెందిన పల్లెల కౌశిక్ (19) ఎచ్చర్ల మండలం నాగావళి నదీ సంగమం దెబ్బల వాణి ప్రాంతంలో సముద్ర స్నానం చేసేందుకు వెళ్లాడు. ఒక్క సారిగా కెరటాలు పెద్దగా రావడంతో అందులో మునిగి మరణించాడు. దీంతో పట్టణమంతా విషాదం నెలకొంది.  

కొద్ది కాలం కిందట  కౌశిక్ తండ్రి పోలీసు ఉద్యోగి అయిన నాగు అనారోగ్యంతో మరణించాడు. ఇప్పుడు అదే కుటుంబంలో ఆయన కుమారుడు మరణించడంతో తల్లిని ఓదార్చడం ఎవరి తరం కావటం లేదు. మృతుడు శ్రీకాకుళం పట్టణంలో సన్ డిగ్రీ కళాశాలలో బి. ఎస్. సి. ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలో చదువులో మెరిట్ స్టూడెంట్ అని కళాశాల యాజమాన్యం తెలిపింది.

Related posts

బిఆర్ఎస్ లో చేరిన బిజెపి నేత

Satyam NEWS

తమ కాళ్లను తామే నరుక్కుంటున్న కమలనాథులు

Satyam NEWS

లోక్ అదాలత్ లోఎక్కువ ఐ.పి.సి. కేసులు డిస్పోజ్ కావాలి

Satyam NEWS

Leave a Comment