38.2 C
Hyderabad
May 1, 2024 21: 59 PM
Slider ముఖ్యంశాలు

తెలంగాణలో ఫిబ్రవరి 5 నుంచి స్కూళ్లకు, కాలేజీలకు అనుమతి?

#school

తెలంగాణలో ఫిబ్రవరి 5వ తేదీ నుంచి స్కూళ్లకు, కాలేజీలకు అనుమతి ఇవ్వవచ్చునంటూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నివేదిక సమర్పించినట్లు తెలిసింది. అయితే తల్లిదండ్రుల ఇష్టం మేరకు ఆన్ లైన్, ఆఫ్ లైన్‌లో విద్యాబోధన చేసుకోవచ్చునని వారు తెలిపారు. కొవిడ్ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పరిస్థితులను బట్టి నిర్ణయం ఉంటుందని అధికారులు తెలిపారు. తెలంగాణలో 20 శాతానికిపైనే పాజిటివ్ రేటు ఉందని, మరో పది రోజుల్లో థర్డ్ వేవ్ ముగిసే అవకాశం ఉందన్నారు. షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు, ప్రవేశ పరీక్షలను నిర్వహించుకోవచ్చునని సీఎం కేసీఆర్‌కు  వైధ్య ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చింది. దీనిపై అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్షిస్తున్నారు. మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ, విధ్యా శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష జరపనున్నారు.

Related posts

అప్పుడు గణతంత్రం ఇప్పుడు రణతంత్రం!

Satyam NEWS

మహిళల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలు అమలు

Satyam NEWS

తుమ్మల ఇంటికి పొంగులేటి

Bhavani

Leave a Comment