31.7 C
Hyderabad
May 2, 2024 08: 21 AM
Slider చిత్తూరు

సత్యవేడు సమీపంలో 43ఎర్రచందనం దుంగలు స్వాధీనం

#redsandals

3 మోటారు సైకిళ్లతో 7గురు స్మగ్లర్లు అరెస్టు

తిరుపతి జిల్లా సత్యవేడు సమీపంలోని అడవుల్లో కూంబింగ్ చేపట్టిన టాస్క్ ఫోర్సు పోలీసులు 43ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఏడుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి నుంచి 3మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్సు డీఎస్పీ చెంచుబాబు ఆదేశాల మేరకు రైల్వే కోడూరు ఆర్ఐ కృపానంద, ఆర్ఎస్ఐ అలీభాషా శనివారం సాయంత్రం నుంచి సత్యవేడు సమీపంలోని నాగలాపురం అడవుల్లో కూంబింగ్ చేపట్టారు. ఆదివారం తెల్లవారు జామున బీరకుప్పం ప్రాంతంలో కొందరు మోటారు సైకిళ్లతో అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని ప్రశ్నించడంతో సంబంధం లేని సమాధానాలు చెప్పారు.

దీంతో వీరిని అదుపులోకి తీసుకోగా, వీరి వద్ద 43ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు అంగీకరించారు. వీరి నుంచి ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని తమిళనాడు తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూడి తాలూకాకు చెందిన సభాపతి ధర్మన్ (45), తిరుపతి జిల్లా తొండవాడకు చెందిన ఐ.రవి(32), తిరుపతి సత్యనారాయణపురంకు చెందిన ఎన్.కోదండపాణి (46), సత్యవేడు మండలానికి చెందిన ఎం. నరసింహులు (50), తిరుపతి అవిలాలకు చెందిన బి.రమేష్ (42), నాగలాపురం బీరకుప్పంకు చెందిన ఏ రమేష్ (34), ఏ.మారయ్య (65)లుగా గుర్తించారు. దుంగలు 664కేజీలు ఉన్నాయని, వీటి విలువ సుమారు రూ.30లక్షలు ఉంటాయని డీఎస్పీ తెలిపారు.  ఈ కేసును తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ లో నమోదు చేసి ఎస్ఐ రఫీ దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

సామాజిక విద్యావంతుల న్యాయ వేదిక ములుగు జిల్లా అధ్యక్షులు గా సంద సుధాకర్

Satyam NEWS

వనపర్తి పోలీస్ ప్రజావాణిలో 7 ఫిర్యాదులు

Satyam NEWS

ఖాట్మండులో ఏడుగురు భారతీయ పర్యాటకుల మృతి

Satyam NEWS

Leave a Comment