28.7 C
Hyderabad
May 6, 2024 02: 34 AM
Slider గుంటూరు

చివరికి ఎమ్మెల్యేలను బతిమాలుకుంటున్న సీఎం జగన్

#balakotaiah

వైసీపీ వర్క్ షాప్ పై బహుజన ఐకాస బాలకోటయ్య వ్యాఖ్య

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన రాష్ట్రవ్యాప్త వైసిపి వర్క్ షాప్ లో స్వపార్టీని, స్వపార్టీ నాయకులను, కార్యకర్తలను కాపాడుకోకపోతే కొంప కొల్లేరు అవుతుందన్న భయం స్పష్టంగా కనిపించిందని, అందుకే నిన్నటిదాకా తగ్గదేలే అని ఎమ్మెల్యే లకు, మంత్రులకు హెచ్చరిక లు, వార్నింగ్ లు ఇచ్చిన ముఖ్యమంత్రి బుజ్జగింపులకు, సన్నాయి నొక్కులకు పెద్ద పీట వేశారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు.  ఈ మేరకు సోమవారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు.

అసంతృప్తులు, అలకలు, అలజడులు ఉన్నమాట వాస్తవమేనని, వాటిని తగ్గించుకోకుంటే అసలుకే ఎసరు వస్తుందన్నదే వర్క్ షాప్ సారాంశం అని తెలిపారు. సీనియర్ ఎమ్మెల్యేకైనా, మంత్రికైనా హెచ్చరికలు, టార్గెట్లు, వార్నింగ్ లు ఇచ్చే  ముఖ్యమంత్రి మీ కోసమే, మీరు గెలిచి మళ్ళీ రావడం కోసమే, రాజకీయాలు అంటే మానవ సంబంధాలు అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు అన్నారు. నాలుగేళ్లలో రెండు లక్షల కోట్లు బటన్ నొక్కాను అని పదేపదే ఆవు కథ చెప్తున్న ముఖ్యమంత్రి గడపగడపకు ఎందుకు వెళ్ళ లేక పోతున్నారో చెప్పలేక పోతున్నారన్నారు. 

రాష్ట్రంలో నాలుగు మూలల నుంచి నాలుగేళ్ళు దోపిడీ చేసి ఆర్థిక  మహారాజులుగా బలపడ్డారని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఒక్క పరిశ్రమను కానీ,  ఏ ఒక్క ఉపాధి అవకాశం కానీ చూపలేని ప్రభుత్వం ఆఖరికి రాష్ట్రానికి అభివృద్ధిని, శాంతిభద్రతలను రెండు కూడా లేకుండా చేసింది అని తెలిపారు. ‘జగన్నన్నకే  చెబుదాం’ అనే కొత్త కార్యక్రమం తీసుకోబోతున్నట్లు చెప్పిన ముఖ్యమంత్రి ముందుగా మూడేళ్ళుగా మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం  ఎందుకు చెప్ప లేకపోయారు అని ప్రశ్నించారు .

అమరావతి రైతులు ఎందుకు రోడ్లెక్కారు? రాష్ట్రానికి ఎన్ని రాజధానులు?  కోర్టు తీర్పు లను గౌరవించరా? హోదా ఏం చేశారు? పోలవరం మాటేమిటి? జాబ్ క్యాలెండర్  ఏమైంది?భవన నిర్మాణ కార్మికులు ఉపాధి ఎందుకు కోల్పోయారు? డాక్టర్ సుధాకర్, చీరాల కిరణ్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అబ్దుల్ సలాం హత్యలకు కారకులు ఎవరు? 27  రకాల ఎస్సీ ఎస్టీ ల  సంక్షేమ పథకాలు ఏమయ్యాయి? సబ్ ప్లాన్ నిధులు ఏం చేశారు?

మహిళలపై అత్యాచారాలు ఎందుకు జరిగాయి? ఏపీలో ఐపీసీ ఉందా? వైసీపీ ఉందా?  వంటి శత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని  డిమాండ్ చేశారు. కేవలం మాటలు చెబితే, స్వపార్టీ ఎమ్మెల్యేలు కూడా నమ్మే పరిస్థితి లేదని, ముందస్తు లేదంటూనే ముందస్తుకు వెళ్లే వ్యూహరచనలో భాగంగానే వర్క్ షాప్ నిర్వహించినట్లు బాలకోటయ్య అభిప్రాయపడ్డారు.

Related posts

జన్మస్థలం లో ఎన్నారై సేవా నిరతి….

Satyam NEWS

పార్టీ ఫిరాయింపుపై కరణం బలరామ్ కు తీరని అవమానం

Satyam NEWS

పదో తరగతి పరీక్షల్లో హిందీ భాషలో ఎలా స్కోర్ చేయాలి?

Satyam NEWS

Leave a Comment