38.2 C
Hyderabad
April 29, 2024 22: 00 PM
Slider గుంటూరు

నరసరావుపేట లో వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం ప్రారంభం

#narasaraopet

దశాబ్దాల కాలంగా అద్దె భవనాలలో కొనసాగుతున్న వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాన్ని సొంత భవనంలోకి మార్చటం అభినందనీయమని గుంటూరు జిల్లా నరసరావుపేట శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు.

నరసరావుపేట పట్టణం లోని బరంపేట లో నూతనంగా నిర్మితమైన భవనంలోకి వాణిజ్యపన్నుల కార్యాలయాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతున్న నరసరావుపేట పట్టణానికి నూతన వసతులతో వాణిజ్య పన్నుల కార్యాలయం నిర్మించడం జరిగిందని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా భవనాలు అన్ని వసతులు సమకూర్చడం జరిగిందన్నారు. 

మంత్రి సహకారంతో ఇన్నాళ్లు అద్దెభవనంలో ఉన్న ఈ శాఖ సొంత భవనానికి మారినందుకు సంతోషంగా ఉంది. వాణిజ్య పరంగా అభివృద్ధి చెందిన ప్రాంతంలో కొన్ని చెల్లింపు దారులు అధికంగా ఉన్నందున వ్యాపారంలో కొన్ని విధానంపై తరచు అవగాహన సదస్సులు నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు.

విశాలమైన ప్రాంగణంలో నిర్మించిన వాణిజ్య పన్నుల కార్యాలయాన్ని అధికారులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని పార్లమెంటు సభ్యులు శ్రీ కృష్ణ దేవరాయలు కోరారు. తదుపరి ముఖ్య అతిధులు ప్రారంభోత్సవం చిహ్నంగా మొక్కలను నాటారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ఎంపీ లతో పాటుగా చీఫ్ కమిషనర్ పీయూష్ కుమార్, సంయుక్త కమిషనర్ కిరణ్ చౌదరి, ఉప కమిషనర్ నాగ జ్యోతి, ఉప కమిషనర్ మురళీ కృష్ణ, సహాయ కమిషనర్ ముత్యాల రావు, నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ హనీఫ్, వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్,స్థానిక వైస్సార్సీపీ నాయకులు, ప్రజలు, వాణిజ్య సంస్థల వారు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తబ్లిగీ జమాత్ వాళ్లు ఎలాంటి నేరం చేయలేదు

Satyam NEWS

ఎలిగేషన్: దోచుకుతింటున్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Satyam NEWS

కామెడీ స్టేషన్స్: నవ్వుకోవాలంటే ఈ పోలీస్ స్టేషన్ కు వెళ్ళండి

Satyam NEWS

Leave a Comment