42.2 C
Hyderabad
April 26, 2024 16: 42 PM
Slider విజయనగరం

మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌లో వామ ప‌క్ష పార్టీల పోటీ

#CPMVijayanagaram

రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల కోలాహలం షురూ అయ్యింది. వ‌చ్చే నెల 10 న పుర‌పాల‌క సంఘాలు ..న‌గ‌ర పాల‌క సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. అధికార పార్టీ తో పాటు టీడీపీ,జ‌న‌సేన‌…చివ‌ర‌కు వామ ప‌క్ష పార్టీలు కూడా త‌మ‌,త‌మ అభ్య‌ర్ధుల‌ను పోటీ చేసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసుకుంటున్నాయి.

ఇప్ప‌టికే ప్ర‌తి పక్ష పార్టీ అయిన టీడీపీ రంగంలోకి దూకేసింది. తాజాగా….గ‌తంలో ఆ పార్టీ మిత్ర ప‌క్ష పార్టీ అయిన వామ‌ప‌క్షాలు త‌మ పార్టీల త‌రుపున అభ్య‌ర్ధుల‌కు దించుతున్నాయి.అందులో భాగంగా ఉత్త‌రాంద్ర‌లో అదీ విజ‌య‌న‌గ‌రం జిల్లాలో అందునా వామ ప‌క్ష బ‌లం  ఉన్న డివిజ‌న్ నుంచీ  రెండు పార్టీలు క‌లిసి ఉమ్మ‌డి అభ్య‌ర్ధిని బ‌రిలోకి దించాయి.

విజ‌య‌న‌గరం…. మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అయిన తర్వాత తొలి సారిగా సీపీఐ,సీపీఎం పార్టీలు  క‌లిసి ఉమ్మ‌డి అభ్య‌ర్ధిగా రెడ్డి శంక‌ర‌రావును బ‌రిలోకి దించుతున్నాయి. న‌గ‌రంలో వామ ప‌క్ష భావ జాలం ఉన్న 33 విడివ‌జ‌న్ అభ్య‌ర్దిగా రెడ్డి శంక‌ర‌రావును పేరును…సీపీఎం,సీపీఐ పార్టీలు ప్రక‌టించాయి.ఈ మేర‌కు న‌గ‌రంలో లావు బాల‌ గంగాధర్ భ‌వ‌న్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో పార్టీకి చెందిన నేత‌లు ఈ విష‌యాన్ని తెలియ చేసారు.

గ‌తంలో స్థానికంగా ఉన్న అప‌రిష్క‌రికృతంగా  ఉన్న చెర‌వు స‌మస్య‌కై పోరాడి 18 నెల‌ల పాటు జైలు కెళ్లాన‌ని అభ్య‌ర్ధి రెడ్డి శంక‌ర‌రావు తెలిపారు ఎల్ల‌ప్పుడు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై వామ ప‌క్ష పార్టీలు పోరాడుతున్నాయ‌ని..అధికారం కోసం తాము  ఎప్పుడూ పోరాడ‌టం లేదని…ప్రజా స‌మ‌స్య‌ల‌పై బ‌హిరంగంగా గ‌ళ‌మెత్త‌తున్నా..రాజ్యంగం ప్ర‌కారం..కార్పొరేట‌ర్ గా ఎన్నికై ఇంకా పోరాడాల్సిన అవస‌రం ఎంతైనా ఉంద‌న్నారు.

అంత‌కుముందు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు పై ఓటేసి త‌మ అభ్య‌ర్ధిని గెలిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి టీ. సూర్యనారాయణ. CPI జిల్లా సహాయకార్యదర్శి బి. అశోక్ లు తెలిపారు.. శంకరరావు గెలిస్తే న‌గ‌ర‌ ప్రజల సమస్యలపై కార్పొరేషన్ లో తమ వాని వినిపించి ప్రజల పక్షం వహిస్తారని. అన్నారు.

ఇప్పటికే ఈ డివిజన్ పరిధిలో లో ముచేరువు గట్టు పై 120 మందికి ఇళ్లు సాధించారని. ఆస్తి పన్ను భారాలు రద్దు చేయాలని కోరుతూ ఉద్యమిస్తున్నారు. మెడికల్ కాలేజీ సాధన కోసం ఉద్యమించిన చరిత్ర కమ్యూనిస్టులకు వుందని సీపీఎం నాయుకునిగా శంకరావుకు పోరాడే చరిత్ర వుందని అన్నారు

Related posts

ఓటు వేసిన తర్వాత….. శ్వాస ఆగింది

Satyam NEWS

మోదీని పొగడ్తలతో ముంచెత్తిన టోనీ అబాట్

Satyam NEWS

ప్రజాసమస్యలపై బిజెపి నేతల పాదయాత్ర

Satyam NEWS

Leave a Comment