28.7 C
Hyderabad
April 27, 2024 04: 00 AM
Slider రంగారెడ్డి

ముగిసిన డేటా విజువలైజేషన్ సంబంధిత అంశాల సదస్సు

#cbit

డిసి ఎమ్ఎస్ఎమ్ఈ  మరియు  యెన్ఐ ఎమ్ఎస్ఎమ్ఈ స్పాన్సర్ చేసిన సి బి ఐ టి – ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగ అధ్వర్యం లో గత వారం రోజులు గా జరుగుతున్న  సమాచార ఆధారిత నిర్ణయాలు మరియు విశ్లేషణలు నిర్వహణ అభివృద్ధి కార్యక్రమం ఈ రోజు తో ముగిసింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమానికి తెలంగాణాలో గల బివిఆర్ఐటి,  శ్రేయాస్, ఎంజిఐటి, ఆంధ్రప్రదేశ్ లో గల ఆర్జిఎంసిఐటి , అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీ అధ్యాపకులు హాజరయ్యారని తెలిపారు.

ఈ కార్యక్రమం లో ఎంఎస్ఎంఈ పధకాల గురించి నిపుణుడు సూర్య ప్రకాష్ గౌడ్ వివరించారు. ఈ కార్యక్రమ కన్వీనర్ ప్రొఫెసర్ అలువాలు రజనీకాంత్ మాట్లాడుతూ పైథాన్ ప్రోగ్రామింగ్, డేటా విజువలైజేషన్, మెషిన్ లెర్నింగ్, అస్సోసియేటివ్ లెర్నింగ్, లాజిస్టిక్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీ మరియు టెక్స్ట్ అనలిటిక్స్ మొదలగు అంశాలు మీద థియరీ, ప్రాక్టికల్ సెషన్స్ ద్వారా శిక్షణ ఇచ్చామని చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కోఆర్డినేటర్స్ గా డాక్టర్  పి రమేష్ బాబు, ఎస్ రాకేష్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కె రామకృష్ణ, ప్రొఫెసర్ ఉమాకాంత చౌదరి, డి జయరామ్, కె గంగాధరావు, డాక్టర్ మదన్ మోహన్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

పౌరసత్వ చట్టంపై ఐఏఎస్ అధికారి తీవ్ర వ్యాఖ్యలు

Satyam NEWS

జర్నలిస్టు మూర్తి పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలి

Bhavani

సెల్ ఫోన్ వెలుతురులో చంద్రబాబు ప్రసంగం

Satyam NEWS

Leave a Comment