32.7 C
Hyderabad
April 26, 2024 23: 36 PM
Slider నల్గొండ

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ

#CongressHujurnagar

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన మూడు చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, రాష్ట్రంలో కె.సి.ఆర్ ప్రభుత్వం ఎన్నికల్లో  రైతులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని వెంటనే నెరవేర్చాలని శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు.

గాంధీ పార్క్ సెంటర్ కు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించి, నిరసన తెలియజేశారు. అనంతరం రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.

కిసాన్ మజ్దూర్ బచావో దివస్ ఇంచార్జ్ మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి , డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు అధ్యక్షత వహించగా కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశముఖ్, టిపిసిసి జాయింట్ సెక్రెటరీ అజీజ్ పాషా,

కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్, రాష్ట్ర ఐటీ సెల్ ఉపాధ్యక్షుడు,  సుంకరి శివరామ్ యాదవ్, పట్టణ ఉపాధ్యక్షుడు జక్కుల మల్లయ్య, కౌన్సిలర్ ములకలపల్లి రామగోపి, వెలిదండ సరిత వీరారెడ్డి, కారంగుల విజయ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాచిమంచి గిరిబాబు, బెల్లంకొండ గురవయ్య,

ఎస్.కె. సైదా మేస్త్రి, పోతన బోయిన రామ్మూర్తి, వల్లపుదాసు కృష్ణ, ఫ్యాషన్ రామరాజు, సమ్మెట సుబ్బరాజు, జింజిరాల సైదులు, అంజన సుదర్శన్, ముషం సత్యనారాయణ, పోతుల జ్ఞానయ్య, కోల మట్టయ్య, దొంతగాని జగన్, కంకణాల పుల్లయ్య, వల్లపు వెంకటేశ్వర్లు,

పాలకూరి లాలు, పాశం కోటమ్మ, గురుమూర్తి, గంజి చంద్రమౌళి, ఉద్దండుడు, కాల్ వెంకటేశ్వర్లు, కడప సైదులు, వెంకటరమణ, కుక్కడపు వీరబాబు, వెంకన్న,  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నిద్రిస్తుండగా ఇల్లు కూలి వ్యక్తి మృతి

Satyam NEWS

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

Murali Krishna

తెలంగాణ కు ఉరుములతో కూడిన వర్ష సూచన

Satyam NEWS

Leave a Comment