40.2 C
Hyderabad
April 28, 2024 17: 22 PM
Slider నల్గొండ

జానారెడ్డి గెలుపుతో కేసీఆర్ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి

#Congress

నల్గొండ జిల్లా మిర్యాలగూడెం డివిజన్ INTUC ముఖ్య నాయకుల సమావేశం మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రంలోని NSP క్యాంపు లోని ఐ ఎన్ టి యు సి కార్యాలయంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న INTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇంఛార్జి యరగాని నాగన్న గౌడ్ మాట్లాడుతూ TRS చేపడుతున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.

ఇప్పటికే రాష్ట్రం లోని అనేక మంది ప్రభుత్వ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేలాది మంది రోడ్డున పడ్డారని,యువ శక్తి నిర్వీర్యమౌతుందని, పరిశ్రమలలోని కార్మికులు నిర్లక్ష్యానికి గురి అవుతున్నారని, అనేక పరిశ్రమలు మూత పడటం వలన వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోయారని అన్నారు.

ప్రభుత్వం తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను భగీరథ వంటి స్కీములలో ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో TRS కు,BJP కి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.యువతను, రైతులను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి గెలుపుతో కనువిప్పు చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా INTUC యూత్ అధ్యక్షుడు N.నాగయ్య, డివిజన్ అధ్యక్షుడు S.వెంకన్న, మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడు SD.చాంద్ పాషా,NSP యూనియన్ సర్కిల్ ప్రధాన కార్యదర్శి P.వెంకన్న, జిల్లా జనరల్ సెక్రటరీS. ఈశ్వరాచారి, జిల్లా నాయకులు మేళ్ళచెరువు ముక్కంటి, విశాఖ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.రాములు,FCI యూనియన్ అధ్యక్షుడు డి.పాండు నాయక్,యన్. షరీన్, సిహెచ్.స్వామి, జి.జానారెడ్డి,యన్. సైదులు, విజయ రమేష్, వి.విక్రమ్,వి. లక్ష్మణ్,NSP యూనియన్ నాయకులు ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మూతపడ్డ చెరుకు ఫ్యాక్టరీలు, డెయిరీలు తెరుస్తాం

Satyam NEWS

కాలువల ఆక్రమణల వలనే ఇండ్లు మునక

Satyam NEWS

హార్బర్ పోలీసు అధికారిని కలిసిన సీనియర్ జర్నలిస్ట్ తిలక్

Satyam NEWS

Leave a Comment