28.7 C
Hyderabad
April 28, 2024 04: 20 AM
Slider ముఖ్యంశాలు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం

#uttamkumarreddy

హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో రోడ్డుషోలో కర్నాటక ఉపముఖ్యమంత్రి డి.కె.శివకుమార్

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్,ఆంద్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి షో,కార్నర్ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, సానుభూతిపరులు భారీగా తరలి వచ్చారు.

ఈ సందర్భంగా కర్నాటక రాష్ట్రం ఉపముఖ్యమంత్రి డి.కె.శివ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు. మిత్రుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నానని, ఉత్తమ్ నియోజకవర్గానికి మాత్రమే కాదు రాష్ట్రంలో కూడా బలమైన వ్యక్తి అని అన్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందో సమాజంలో అన్ని వర్గాలు కూడా అధికారంలో ఉన్నట్లేనని అన్నారు.

హుజూర్ నగర్ నియోజికవర్గం సిమెంట్ పరిశ్రమలకు పుట్టినిల్లు అని, సిమెంట్ ఏ విధంగా ఇంటిని పటిష్టం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య సంబంధాలను పటిష్టం చేస్తుందని అన్నారు. ఈ హుజూర్ నగర్ నియోజకవర్గం రైతులు అదృష్టవంతులని, కాంగ్రెస్ పార్టీ నిర్మించిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తో మంచి పంటలు పండిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ నిర్మించిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 60 ఏళ్ల క్రితం నిర్మించినా ఇప్పటికీ చాలా పటిష్టంగా ఉందని,మూడేళ్ల క్రితం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పుడే కుంగి పోయిందని,పదేళ్ల పాటు కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్రటేరియట్ లో అడుగు పెట్టలేదు.ఇప్పుడు పర్మినెంట్ గా విశ్రాంతినిద్దామని అన్నారు.

బిజేపి బిఆర్ఎస్ ది చేకటి ఒప్పందమని అన్నారు.తెలంగాణకి గాంధీ కుటుంబానికి అత్యంత అవినాభావ సంబంధం ఉందని,తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ ఋణం తీర్చుకొనే సమయం వచ్చిందని,ఆ ఋణం తీర్చుకోవాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ప్రజలందరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా అధికారంలోకి వచ్చిందో తెలంగాణలో కూడా అధికారంలోకి తప్పకుండా వస్తుందని డి.కె.శివకుమార్ అన్నారు.హుజూర్ నగర్ నియోజకవర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి హాయం లోనే అభివృద్ధి జరిగిందని,కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీమ్స్ తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలబడుతుందని,

తాము కర్ణాటకలో ఇచ్చిన 5 గ్యారెంటీ పథకాలను ఇప్పటికే అమలు చేశామని తెలిపారు.తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతీ మహిళకు 2వేల రూపాయిలు,గ్యాస్ సిలిండర్ 400 కు, ఇందిరమ్మ రైతు భరోసా కింద ప్రతీ రైతుకి 15,000 రూపాయిలు,భూమి లేని రైతు కూలీలకు 12,000 రూపాయిలు,వరి పండించే రైతులకి ఎం ఎస్ పి  కి అదనంగా 500 రూపాయలకు కొంటాంమని, ఇల్లు లేని ప్రతీ పేదవారికి 100 గజాల స్థలం 5 లక్షల రూపాయలను ఇస్తామని, కెసిఆర్,కేటీఆర్ ఎమ్మెల్యే లను కర్ణాటకకు ఆహ్వానిస్తున్నాం మీరే వచ్చి చూడండి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన.5 స్కీమ్స్ లను ఇప్పటికే అమలు చేస్తున్నామని అన్నారు.

కెసిఆర్ దళితులను సీఎం చేస్తా అన్న హామీని మరిచాడని,దళితులకు, గిరిజనులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు శివకుమార్. కెసిఆర్ హామీ ఇచ్చిన మైనారిటీలకు, గిరిజనులకు ఇచ్చిన రిజర్వేషన్లు ఏమయ్యాయని? కెసిఆర్ ఇంటికొక ఉద్యోగం ఇస్తా అన్న హామీని ఏమైంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం.

బీజేపీ,బిఆర్ఎస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉంది. బిఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీ కి ఓటేసినట్లే అని,నాకు వచ్చిన లక్షా 20వేల మెజారిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి కూడా రావాలని,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని,ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు గుర్తింపు తప్పక ఉంటుందని,తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ కి బహుమానంగా ఇవ్వాలని కోరారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

తుమ్మల, రేగా సమావేశంపై సర్వత్రా చర్చ

Murali Krishna

“నట”వ్యవసాయానికి నడుం కట్టిన పుడమి పుత్రుడు

Satyam NEWS

పెట్రోల్ బంకులో పనిచేస్తున్న ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లు

Satyam NEWS

Leave a Comment