భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమం హైదరాబాద్ లోని నక్లెస్ రోడ్డు వద్ద ఘనంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఘన నివాళి అర్పించారు. దేశానికి ఇందిరాగాంధీ అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇందిరాగాంధీకి నివాళి అర్పించిన వారిలో కాంగ్రెస్ శాసనసభా పక్షం నాయకుడు భట్టి విక్రమార్క, సీనియర్ నాయకుడు, ఇందిరాగాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన వి.హనుమంతరావు, మాజీ ఎంపిలు అంజన్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, షేక్ షరీఫ్, మధుకర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, నిరంజన్, రాజ్ కుమార్, వాజిద్ హుస్సేన్, శ్రీనివాసయాదవ్, సచ్ దేవ్, నరేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.