దేవాలయాల్లో అన్యమత ప్రచారం, ఇంగ్లీష్ మీడియం ద్వారా మత ప్రచారం లాంటి వివాదాస్పద అంశాలు రగులుతూనే ఉన్న ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ కీలక నిర్ణయం ద్వారా జెరూసలేం యాత్రికులకు ఆర్ధికసాయం పెరుగుతుంది. జెరూసలేం వెళ్లే యాత్రీకులలో రూ.3 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారికి ఇచ్చే సాయం రూ.40 వేల నుంచి రూ.60 వేలకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా రూ. 3 లక్షల కన్నా ఎక్కువ వార్షికాదాయం ఉన్న వారికి ఆర్ధిక సాయం రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచుతూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జెరూసలేంతో పాటు ఇతర క్రైస్తవ ప్రార్ధనా స్ధలాల సందర్శనకు కూడా ఆర్ధిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్ధిక సాయం పెంపుపై గత కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. కాగా నేడు ఉత్తర్వులు వెలువడ్డాయి.
previous post