28.7 C
Hyderabad
April 28, 2024 05: 04 AM
Slider నిజామాబాద్

సెప్టెంబర్ 17 న కాంగ్రెస్ మేనిఫెస్టో

#shabbirali

సెప్టెంబర్ 17 న కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తామని మాజీ మంత్రి షబ్బీర్ అలీ తెలిపారు. మంగళవారం కామారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షబ్బీర్ అలీ మాట్లాడారు. ఈ నెల 2న ఖమ్మంలో నిర్వహించిన జనగర్జన సభను విజయవంతం చేసినందుకు ప్రజలకు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత లక్షలాది మందితో సభ విజయవంతం కావడం ఇదే తొలిసారి అని చెప్పారు. ఖమ్మం సభతో కుటుంబ పాలన, గడీల పాలనను అంతమొందించాలని ప్రజలు డిసైడ్ అయ్యారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఏ టీమ్, బి టీం అన్నారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తేదార్ పార్టీ అని కాంగ్రెస్ రాహుల్ గాంధీ మరోసారి చెప్పారన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు నా గెలుపు వల్లే పార్టీకి ఊపు వచ్చిందని, బండి సంజయ్ కు వందల కోట్లు ఎలా వచ్చాయని నిలదీస్తున్నారని షబ్బీర్ అలీ గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో బీఆర్ఎస్ సంపాదించిన దాంట్లో బండి సంజయ్ కు వాటా వెళ్లిందని ఆ పార్టీ నాయకులే చెప్తున్నారని కామెంట్ చేశారు. బండి సంజయ్ ఒక్కరిదే కాకుండా మిగతా అందరి పేర్లు కూడా రఘునందన్ రావు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం చేసిన 5 లక్షల కోట్ల అప్పులో 30 శాతం కమిషన్లు వాటాలు పంచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ కు దమ్ముంటే 5 లక్షల కోట్ల అప్పుపై చేసిన ఖర్చులు, పనుల వివరాలను శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో పంపిణీ చేసిన పోడు పట్టాలు బీఆర్ఎస్ నాయకుల బంధువులకే 50-60 శాతం పంపిణీ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 4 వేల పింఛన్ ఇస్తామని తమ నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించారన్నారు.

ఇప్పటికే యువత, రైతుల విషయంలో పార్టీ డిక్లరేషన్ ప్రకటించిందని, త్వరలో మరో మూడు డిక్లరేషన్స్ వస్తాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రాబోతుందని చెప్పారు. తమ పార్టీ నుంచి అధికార పార్టీలోకి వెళ్లి సీఎం కేసీఆర్, కేటీఆర్ వద్ద బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారని, వాళ్లంతా తిరిగి పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. పదేళ్లుగా పార్టీ అధికారంలో లేకున్నా పార్టీ పట్ల విశ్వాసం చూపిస్తూ అధికార పార్టీ బెదిరింపులకు భయపడకుండా నిలబడిన కాంగ్రెస్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

త్వరలో డబుల్ ఇళ్ల పరిశీలన

కామారెడ్డి నియోజకవర్గంలో చిన్నపాటి వర్షం పడితే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తడిసిపోయి ప్రజలు ఇబ్బందులకు గురయ్యే పరిస్తితి ఉందన్నారు. ఇప్పటికే ప్రజలు తనకు ఫోన్ చేసి పరిస్తితిని వివరిస్తున్నారని, నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను త్వరలో పరిశీలిస్తామన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నాణ్యత పరిశీలనపై సవాల్ చేసిన ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పత్తా లేకుండా పోయారన్నారు. గత నెల 22 తర్వాత ఫ్రీ అవుతానని ఎమ్మెల్యే చెప్తే పరిశీలనకు తాను కూడా సిద్ధమని చేసిన సవాల్ పై ఎమ్మెల్యే నుంచి స్పందన రాలేదన్నారు. కమిషన్లకు కక్కుర్తి పడి నాసిరకం ఇళ్లను నిర్మించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, కామారెడ్డి పట్టణ, మండల, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్ రెడ్డి, గుడుగుల శ్రీనివాస్, నాయకులు అశోక్ రెడ్డి, గణేష్ నాయక్, ఇంద్రకరణ్ రెడ్డి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వం పై ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆగ్రహం

Bhavani

నెహ్రూ విధానాలే సర్వదా ఆచరణీయం

Bhavani

Free Sample _ List Of All Prescription Weight Loss Pills T5 Fat Burning Pills Reviews

Bhavani

Leave a Comment