39.2 C
Hyderabad
April 28, 2024 11: 48 AM
Slider ముఖ్యంశాలు

ప్రభుత్వం పై ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆగ్రహం

#MLA Sridhar Babu

ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారిందని మంథని ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్ బాబు అన్నారు. ప్రభుత్వం వెంటనే మొద్దు నిద్ర వీడాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రతిపాదికంగా మరమత్తు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. మానేరు పరివాహక ముంపు ప్రాంతాన్ని రైతులతో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తాడిచర్ల మల్లారం చిన్నతుండ్ల, వల్లెంకుంట, కుంభంపల్లి గ్రామాల రైతులు ప్రతి ఏడాది నష్టపోతున్నారని తెలిపారు. మానవ తప్పిదం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వరదలు సంభవిస్తున్నాయన్నారు. మానేరు నది ఇరుపక్కల కరకట్టలు నిర్మించాలని ప్రభుత్వం దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్లిన పెడచెవిన పెట్టిందని ఫైర్ అయ్యారు.

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో మానేరు నదిలో చెక్ డ్యాం నిర్మించారన్నారు. దీంతో రైతులు నష్ట పోతున్నారన్నారు. వందల సంఖ్యలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు విద్యుత్ పోల్స్ కరెంట్ లైన్‌తో పాటు రైతుల మోటర్లు సహా వరదల్లో కొట్టుకుపోయాయన్నారు. వ్యవసాయ భూములు పనికి రాకుండా ఇసుక మేటలు వేయడం వల్ల రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారని తెలిపారు.

సర్వే చేయించి వెంటనే పంట నష్టపరిహారం కూడా అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాల కారణాలతో వర్షం రావడం సహజం కానీ రైతులకు ఇంత నష్టం వాటిల్లడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. ప్రత్యేక సిబ్బంది కేటాయించి యుద్ధ ప్రతిపాదికంగా విద్యుత్ మరమ్మత్తు పనులు చేయించాలని డిమాండ్ చేశారు.

పంట భూములు సాగులోకి వినియోగించేలా రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టారని కానీ ఎవరికీ ఉపయోగం లేదన్నారు.పోటెత్తిన వరదలు రైతుల పంట పొలాలు వరదల రూపంలో ధ్వంసం చేయడం వల్ల అనేక మంది రైతులు నష్టానికి గురవుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మానేరు ఇరువైపులా కరకట్ట నిర్మించి రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

మళ్లీ ఇలాంటి పంట నష్టం, ప్రభుత్వ ఆస్తి నష్టం పునరవృతం కాకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని చూడాల్సిన బాధ్యత ఇరిగేషన్ శాఖ అధికారులపై ఉందని సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఐత ప్రకాశ్ రెడ్డి, ఎంపీపీ చింతలపల్లి మలహల్రావు, విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, రైతులు బొబ్బిలి రాజు గౌడ్, కేసరపు చంద్రయ్య తోపాటు ప్రజలు ఉన్నారు.

Related posts

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యమేలుతున్న తాలిబాన్ మూకలు

Satyam NEWS

స్వయంభు శంభు లింగేశ్వర స్వామివారిని కిరణాలతో స్పృశించిన ఆదిత్యుడు

Satyam NEWS

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

Bhavani

Leave a Comment