24.7 C
Hyderabad
March 26, 2025 10: 51 AM
Slider విజయనగరం

రామతీర్ధం కొండ ఎక్కకుండా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరెస్ట్

#Sailajanath

రామతీర్థం నీలాచలం కొండపై జరిగిన ఘటన రాష్ట్రాన్నే కుదిపేస్తోంది. మొన్న, నిన్నటి వరకు టీడీపీ, బీజేపీ నేతల అరెస్టు లతో దద్దరిల్లిన విజయనగరం తాజాగా మరో రాజకీయ పార్టీ అరెస్టు తో మరింత గా హీట్ పెరిగింది.

రామతీర్థం వెళ్లేందుకు మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శైలజానాథ్ మీడియా తో మాట్లాడారు.

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు బాధ్యత వహించాలన్నారు. కేంద్రంలో మోడీ ,రాష్ట్రంలో జగన్ లు ఇద్దరూ మిలాఖత్ అయ్యారని శైలజానాథ్ ఆరోపించారు.

అనంతరం రామతీర్థం నీలాచలం కొండకు కార్యకర్తలతో పార్టీ కార్యాలయం నుంచీ బయటకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు.

టూటౌన్ సీఐ మురళీ ,ఎస్ఐ దేవిలు తన సిబ్బంది తో శైలజా నాధ్ ను అడ్డుకున్నారు. అక్కడే పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

డీఎస్పీ అనుమతి తీసుకున్న అనంతరం… పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ను పోలీసులు వన్ టౌన్ కు తరలించారు.

Related posts

విద్యార్థినిని ప్రోత్సహించిన కళింగాంధ్ర చైతన్య దీపిక

Satyam NEWS

పెళ్లి వేడుకకు ఊటీ వెళ్లి వస్తే ఇల్లు లూటీ

Satyam NEWS

అధికారులు మానవతా దృక్పథంతో సుపరిపాలన అందించాలి

mamatha

Leave a Comment