33.7 C
Hyderabad
April 27, 2024 23: 27 PM
Slider నల్గొండ

సామాన్యుల నడ్డి విరిస్తున్న మోడీ ప్రభుత్వం

#Hujurnagar Congress

కరోనా లాక్ డౌన్ ఫలితంగా ప్రపంచమంతా ఆర్థికంగా కృంగిపోయి ఉంటే కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని, గత 20 రోజులుగా నిత్యం పెట్రోలు, డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు, ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, పట్టణ సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరలు రోజు రోజుకూ తగ్గుతూ ఉంటే దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

కరోనా విలయతాండవంలో కూడా ధరలు తగ్గించరా

నేడు దేశంలో నిరుద్యోగ సమస్యతో పాటు గత నాలుగు మాసాలుగా కరోనా వైరస్ తో ప్రజలంతా విలవిలలాడుతూ  తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వారు అన్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా బిజెపి ప్రభుత్వం వ్యాపార దృక్పథంతో వ్యవహరించటం సరైన పద్ధతి కాదని, ఇప్పటికే పేద, మధ్యతరగతి, ఉద్యోగ, వ్యాపార, రైతు, చిల్లర వర్తకులు తీవ్రంగా నష్టపోయారని వారు తెలిపారు.

ప్రభుత్వాలు చేసిన ఉపశమన కార్యక్రమాలు ఆర్ధిక వెసులుబాటు ప్రజలను పెద్దగా ఆదుకోలేకపోయాయని, వలస కార్మికులు తీవ్రంగా నష్ట పోయారని, ఉద్యోగ, ఉపాధి కరువై వందల కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించి కాలం వెళ్లదీసే దుర్భరమైన జీవితాన్ని చవిచూశారని అన్నారు.

లెక్క ప్రకారం 60 శాతం ధరలు తగ్గాలి

2014లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర 108 డాలర్లు ఉన్నప్పుడు లీటర్ పెట్రోల్ ధర 71.40  పైసలు గా డీజిల్ ధర 59.49 పైసలుగా అంటే ఈరోజు  బీజేపీ ప్రభుత్వ కాలంలో అంతర్జాతీయంగా 43.41 డాలర్లకు క్రూడ్ ఆయిల్ ధర దిగజారి నా రేట్లు తగ్గలేదని అన్నారు.

సుమారు 60 శాతం క్రూడ్ ఆయిల్ ధర తగ్గినందున లీటర్ పెట్రోల్ ధర 20.68 ఉండాలి. కానీ ఎక్సైజు పన్నులు పెంచి నేడు పెట్రోల్ ధర 82.96 రూపాయలుగా, డీజిల్ ధర 78.19 రూపాయలుగా పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు.

2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేనాటికి లీటరు పెట్రోల్ పై రూ.9.20 పైసలు, డీజిల్ లీటరుకు రూ. 3.46 పైసలు,2020 సంవత్సరం నాటికి భారతీయ జనతా పార్టీ గత ఆరు సంవత్సరాలుగా దుర్మార్గపు పాలన లో పెట్రోల్పై లీటర్ కు ప్రస్తుతం ఎక్సైజ్ పన్ను 32.98 రూపాయలుగా, డీజిల్ పై 31.83 రూపాయలుగా పెంచి పేద ప్రజల కష్టార్జితాన్ని దోపిడీ చేస్తున్నారని అన్నారు.

నాటి హామీలు మరచిన బిజెపి ప్రభుత్వం

2014వ సంవత్సరంలో బిజెపి అధికారంలోకి రావటానికి ముందు డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేస్తామని హామీలు గుప్పించారు. కానీ నాటి హామీలు మరిచారని వారు విమర్శించారు. ధర్నా నిర్వహించిన అనంతరం హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ బంటు నాగిరెడ్డికి మెమోరాండం సమర్పించారు.

 ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకరి శివరామ్ యాదవ్, ఎండి అజీజ్ పాషా, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రావణ్ కుమార్, జక్కుల మల్లయ్య, కోలపూడి యోహాన్, స్థానిక కౌన్సిలర్లు తేజావత్ రాజా, ములకలపల్లి రామగోపి, వెలిదండ వీరారెడ్డి,కారింగుల్ల వెంకటేశ్వర్లు, జక్కుల నరేందర్, ఇంటిమళ్ళ బెంజిమెన్ పాల్గొన్నారు.

ఇంకా, ఎస్ కె బిక్కన్ సాహెబ్, కోల మట్టయ్య, బెల్లంకొండ గురవయ్య, పోతనబోయిన రామ్మూర్తి, వల్లపుదాసు కృష్ణ, కే ముత్తయ్య, ముశం సత్యనారాయణ, దొంతగాని జగన్, కోలపూడి చంటి, తిప్పని యలమంద, చిన్నం శ్రీనివాస్, రేపా ఆకుల కోటయ్య, మోదాల సైదులు, గుండు అంజి, దాసరి రాములు, యడవెల్లి వీరబాబు, పాశం కోటమ్మ, చెడ్డ శివ పార్వతి, భీమిశెట్టి గోపి నాయుడు, పాల్వాయి రాములు, కుక్కడపు వీరబాబు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

లావణ్య మరణానికి కారణమైన మహిళ గుర్తింపు

Satyam NEWS

యాక్సిడెంట్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

Satyam NEWS

నారా లోకేష్ పై దాడి హేయమైన చర్య

Satyam NEWS

Leave a Comment