28.7 C
Hyderabad
April 28, 2024 10: 17 AM
Slider మహబూబ్ నగర్

పెట్రోలు ధరలపై వనపర్తిలో కాంగ్రెస్ నిరసన ప్రదర్శన

#CongressPartyWanaparthy

మాజి మంత్రి చిన్నారెడ్డి  ఆదేశాల మేరకు   యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో   వనపర్తి జిల్లా కేంద్రంలోని  మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి ఇంటి దగ్గర నుండి రాజీవ్ చౌక్ మీదుగా కలెక్టరేట్ వరకు ఎద్దులబండి, ఆటో   బైకులను లాగారు. యువజన నాయకులు నిరసన తెలిపారు. 

పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరల పైన, నిరుద్యోగ సమస్య పైన  ఇతర అంశాల పైన ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి వనపర్తి జిల్లా కాంగ్రెస్ ,యువజన కాంగ్రెస్ బీసీ సెల్ ఎస్సీ సెల్ ఎస్టీ సెల్ మైనార్టీ సెల్ మహిళా సెల్ వికలాంగుల సెల్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల జిల్లాస్థాయి మండలస్థాయి కార్యకర్తలు నాయకులు తరలి వచ్చి  కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.  

సామాన్యులు రైతులు పడుతున్న టువంటి కష్టాలను ప్రభుత్వ దృష్టికి తేవడంతో పాటు సంబంధిత ఆయిల్ కార్పొరేషన్ కు ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.   కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు.   ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

డిసిసి అధ్యక్షుడు తైలం శంకర్ ప్రసాద్ , పీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, రంగాపూర్ జెడ్పీటీసీ రాజేంద్ర ప్రసాద్ యాదవ్, రాష్ట్ర ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు  పల్లెపగు ప్రశాంత్  , టౌన్   అధ్యక్షులు కిరణ్ కుమార్   ,జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు  దివాకర్ యాదవ్, ఎన్ ఎస్ యూఐ  నేషనల్ కో ఆర్డినేటర్  నందిమల్ల త్రినాథ్ ,డీసీసీ ప్రధాన కార్యదర్శి  మొగిలి సత్యారెడ్డి   ,జిల్లా ప్రధాన  కార్యదర్శి తిరుపతయ్య,

కౌన్సిలర్ బ్రహ్మం,  కౌన్సిలర్ మధుగౌడ్ ,  మాజీ కౌన్సిలర్ కృష్ణ బాబు, మాజీ కౌన్సిలర్ సతీశ్ యాదవ్,  మాజీ ఎంపీపీ  శంకర్ నాయక్ ,  జిల్లా కార్యదర్శి రాగి వేణు, చీర్ల జనార్దన్ రావు, బాల్ రామ్ నాయక్, ఎస్టీ సెల్ నాయకులు  జీ.వి. ఎస్. రాజునాయక్ , 

ఎల్ వీ ఎస్  నాయకులు శివకుమార్, దిలీప్ యాదవ్,  నందిమల్ల జయచంద్ర,    వివిధ మండలాల  నాయకులు సురేష్ గౌడ్,  వాల్య నాయక్,  శ్రీధర్, పాండు రావు, నారయణ, సత్యం, మణ్యం యాదవ్, పెంటన్నయాదవ్ నిరసన ర్యాలిలో పాల్గోన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా అరుణ తార

Satyam NEWS

ఆర్డీసీ కాంప్లెక్స్ లో ప్ర‌ధాన రోడ్ల మీద ఖాకీలు ఏం చేస్తున్నారో తెలుసా..?

Satyam NEWS

టీడీపీ అనాలోచిత విధానాల వల్లే ఇబ్బంది పడ్డ ఇమామ్ లు

Satyam NEWS

Leave a Comment