30.7 C
Hyderabad
April 29, 2024 04: 44 AM
Slider విజయనగరం

ఆర్డీసీ కాంప్లెక్స్ లో ప్ర‌ధాన రోడ్ల మీద ఖాకీలు ఏం చేస్తున్నారో తెలుసా..?

Vijayanagaram Police

క‌రోనా సెకండ్ పుణ్య‌మా జిల్లాలో ప్ర‌తీ ఒక్క‌రూ క‌నీస జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఈ వేవ్ కార‌ణంగా సామాన్య ప్ర‌జానీక‌మే కాకుండా ఉన్న‌తాధికారులు,ప్ర‌జాప్ర‌తినిథులు కూడా దీని బారిన ప‌డుతున్నారు.

ఫ‌లితంగా త‌మ‌,త‌మ విధుల‌కు సెలువులు పెట్టి డాక్డ‌ర్ల సూచ‌న‌ల మేర‌కు హోంఐసోలేష‌న్ లో ఉంటున్నారు.ఇటీవలే విజ‌య‌న‌గ‌రం ఆర్డీసీ డీఎంకు అలాగే మ‌రికొంత మంది అధికారుల‌తో పాటు పోలీస్ శాఖ‌లో కూడ  దాదాపు 50 మందికి క‌రోనా సెకండ్ వేవ్ సోకింది.

102 టెంప‌రేచ‌ర్ తో ప్ర‌తీ ఒక్క‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. తాజాగా ఎస్పీ రాజ‌కుమారీ ఆదేశాల మేర‌కు ఏర్మ‌డ్ రిజ‌ర్వ్ ఇన్ స్పెక్ట‌ర్  మరియన్ రాజు ఆధ్వర్యంలో సిబ్బంంది ఆర్టీసి కాంప్లెక్స్ లో ప్రయాణికులకు కరోనా వ్యాప్తి నియంత్రణ పట్ల అవగాహన కల్పించారు.

కాంప్లెక్స్ లో వ‌చ్చే ప్ర‌తీ ప్ర‌యాణీకుడు తప్ప‌ని స‌రిగా మాస్క్ పెట్టుకోవాల‌ని సూచించారు. ఇక జిల్లా వ్యాప్తంగా పోలీస్ సిబ్బంది అంతా  క‌రోనా పై అవ‌గాహ‌న క‌ల్పించే చ‌ర్య‌ల‌కు దిగారు. ఈ మేర‌కు   విజయనగరం రూరల్ ఎస్ఐ నారాయణరావు జమ్ము వద్ద వాహన తనిఖీలు చేపట్టి వాహనదారులకు కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించారు.

అలాగే నిబంధనలు అతిక్రమించిన వారికి జరీమానాలు విధించ అదే విధంగా పూస‌పాటిరేగ‌లోరూ ఇటు రామ‌భ‌ద్ర‌పురం వ‌ద్ద సంబంధిత ఎస్ఐలు జయంతి, కృష్ణమూర్తి లు వాహన తనిఖీలు చేపట్టి వాహనదారులకు కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించి, నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు విధించారు.

Related posts

రాష్ట్రంలో ముగ్గురు ఐ ఎఫ్ ఎస్ అధికారుల బదిలీ

Satyam NEWS

5 నెలల తర్వాత జైలు నుంచి చింతమనేని విడుదల

Satyam NEWS

బండారుపల్లి లో కరోనా టెస్ట్ లు..7మందికి సోకిన వైరస్

Satyam NEWS

Leave a Comment