38.2 C
Hyderabad
April 28, 2024 20: 53 PM
Slider శ్రీకాకుళం

71 వ రాజ్యాంగ దినోత్సవ సభను విజయవంతం చేయండి

#constitution day

దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించడానికి బాబా సాహెబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు పాటు నిర్విరామంగా కృషి చేసి రాజ్యాంగాన్ని రచించగా దాన్ని ఆమోదించిన రోజున నిర్వహిస్తున్న రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేస్తున్న సభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

నేడు శ్రీకాకుళం పట్టణ కేంద్రంలోని స్థానిక ఇల్లిసిపురం లో గల అంబేద్కర్ విజ్ఞాన మందిర్ లో శ్రీకాకుళం జిల్లా దళిత సంఘాల జేఏసీ నాయకులు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా దళిత సంఘాల జేఏసీ నాయకులు, సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కల్లేపల్లి రాంగోపాల్, ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరమ్  జిల్లా అధ్యక్షులు కంఠ  వేణు, దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సాకే టీ నాగరాజు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాయి  వేణుగోపాల్ రావు ,ఎస్సీ ఎస్టీ సర్పంచుల సంఘం జిల్లా నాయకులు యజ్జల గురుమూర్తి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 71 వ రాజ్యాంగ దినోత్సవం సభ ను జిల్లా  కేంద్రంలో గల అంబేద్కర్ విజ్ఞాన మందిర్ లో జిల్లా దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభకు కు జిల్లాలోని దళిత ,బహుజన ప్రజాసంఘాల  నాయకులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు విద్యార్థినీ, విద్యార్థులు యువకులు, మహిళలు ప్రజలందరూ  విరివిగా పాల్గొని విజయవంతం చేయాలని పత్రికా ముఖంగా తెలియజేశారు.

విభిన్న సంస్కృతులు విభిన్న మతాలు విభిన్న కులాలు, విభిన్న ప్రాంతాల్లో కలిగిన ప్రపంచంలోనే అతి పెద్ద దేశం అయిన భారత  దేశం లోని ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం  అనే అంశాలను ప్రసాదించి స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించిన టువంటి రాజ్యాంగం ప్రాముఖ్యత ను ఆవశ్యకతను దేశం లో ప్రతి   పౌరుడు తెలుసుకొని చైతన్యంతో ప్రజాస్వామ్య వ్యవస్థలో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ సమావేశంలో సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బోడసింగి రాము, అంబేద్కర్ ఇండియా మిషన్ జిల్లా కన్వీనర్ తైక్వాండో శ్రీను , మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు సాంబారిక  సూరిబాబు ,  జిల్లా నాయికులు యడ్ల జానకి రావు , ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు నల్లబారిక అప్పారావు, బుద్ధిష్ట్  సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా నాయకులు బోయిడి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వోటింగ్ టుమారో :ట్రంప్‌ అభిశంసనపై సెనెట్‌ లో విచారణ

Satyam NEWS

రైతుబంధు మాసపత్రిక వ్యవసాయ రంగ కథల పోటీ

Satyam NEWS

50 శాతం అదనపు ఛార్జీతో సంక్రాంతికి 1266 ప్రత్యేక బస్సులు

Satyam NEWS

Leave a Comment