33.7 C
Hyderabad
April 29, 2024 02: 54 AM
Slider వరంగల్

సమగ్ర బాలల పరిరక్షణ సేవలను వినియోగించుకోవాలి

#Integrated Child Protection Services

బాలలకు సేవలందించేందుకు ICPS సిద్దంగా ఉంటుందని (Integrated Child Protection Services – ICPS) సోషల్ వర్కర్ జ్యోతి తెలిపారు.

18 సంవత్సరాల లోపు బాల-బాలికల హక్కుల రక్షణ, మెరుగైన సంరక్షణ కోసం బాలల న్యాయ చట్టం – 2000 ప్రకారం కేంద్రం – రాష్ట్రాలతో సంయుక్తంగా దేశమంతా సమగ్ర బాలల పరిరక్షణ పథకాన్ని ప్రారంభించారు.

ఈ పథకం పరిధిలోకి రక్షణ-సంరక్షణ అవసరం గల బాల బాలికలు, అనాధలు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, వదిలి వేయబడిన, తప్పిపోయిన, ఇంటి నుండి పారిపోయిన, నిరాదరణకు గురౌతున్న బాలలు వస్తారు.

బాల కార్మికులు, వీధి బాలలు, భిక్షాటన చేస్తున్న బాలలు బాల, బాలికల అక్రమ రవాణా అంటే, వేశ్యలుగా, బిక్షగాళ్ళుగా మార్చడం కోసం అమ్మడం, తరలించడం లైంగిక వేధింపులకు, లైంగిక దోపిడికి, లైంగిక పరమైన అసభ్య ప్రవర్తనకు గురౌతున్న బాలలు కూడా ఈ పథకం కిందికి వస్తారు.

బాల్య వివాహాలు శారీరకంగా హింసకు, గాయపరచబడిన, భయబ్రాంతులకు గురౌతున్న బాలలు మత్తు పదార్ధాలు – మత్తు పానీయాలకు బానిసైన బాలలునిరాశ్రయులు, వలసబాలలు, పోషించలేని స్థితిలో ఉన్న కుటుంబాల బాలలను కూడా ICPS సంరక్షిస్తుంది.

మానసిక – శారీరక అంగవైకల్యం గల బాలలు అనారోగ్యం, ధీర్ఘకాలిక, నయం కాని వ్యాధులతో, చట్టంతో విబేధించబడి సంఘర్షణలో ఉన్న బాలలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న బాలలు, చట్టంతో సంబంధంగల బాల-బాలికలు అంటే బాధితులు లేక సాక్షులు ఈ విధంగా వివిధ రకాలుగా ఉన్న బాలలను పరిరక్షించే ఉద్దేశ్యం తో సమగ్ర బాలల పరిరక్షణ సేవల పథకాన్ని రూపొందించారు.

ఈరోజు ములుగు, ST కాలనీ లోని అంగన్వాడి సెంటర్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసిపిస్ కౌన్సిలర్ ప్రవీణ్, అంగన్వాడీ టీచర్లు బాల బాలికలు వారి తల్లిదండ్రులు. పాల్గొన్నారు.

Related posts

పసుపు రైతులకు పాచిపోయిన అన్నం పెట్టిన బిజెపి

Satyam NEWS

వైకుంఠ ఏకాదశి సంఘటనలపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి

Satyam NEWS

ఎఫ్ఆర్ ఓ శ్రీనివాస్ భార్యకు డీటీ ఉద్యోగం

Bhavani

Leave a Comment