Slider శ్రీకాకుళం

శ్రీకాకుళం లో కోడి రామ్మూర్తి స్టేడియం తక్షణమే నిర్మించాలి

#srikakulam

కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాల ని సి.పి.ఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు రాష్ట్ర కమిటీ సభ్యులు భవిరి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఎం పార్టీ ప్రజల మద్దతుతో పెద్ద పోరాటం చేస్తుందని హెచ్చరించారు. 

స్టేడియం పనులను సిపిఎం బృందం పరిశీలించిన అనంతరం సిపిఎం  కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన కోడి మూర్తి స్టేడియంను 2016 ఆగస్టులో టిడిపి ప్రభుత్వం ఆధునీకరణ పేరుతో కూల్చింది. దీని నిర్మాణానికి నిధులు 15 కోట్లు రూపాయలు కేటాయించకపోవడంతో నిర్మాణం పనులు జరగలేదు. తర్వాత వచ్చిన వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వం కూడా నిధులు కేటాయించకపోవడంతో అది పందులు దబ్బగా మారిపోయింది.

వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని అనడానికి స్టేడియం ఒక ఉదాహరణ మాత్రమే. ఆరు సంవత్సరాల కాలంలో 15 కోట్లు స్టేడియంకు కేటాయించడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? స్టేడియం లో ఎంతో మంది ప్రపంచ స్థాయి క్రీడాకారులులను తయారుచేసింది. కరణం మల్లేశ్వరి(ఓలింపిక్) నీలం శెట్టి సైలజ (అర్జున్ అవార్డు) కరణం క్రిష్ణ కుమారి, నరసమ్మ, ఎన్ జి నాయుడు మొదలగు వారు ఏషియన్ గేమమ్స్ లొ అనేక పతకాలు సాధించారు.

శాంతి, ప్రసన్న, చంద్ర, విక్రాంత్, ధనుంజయ మొదలగు వారు ఏషియన్ గేమ్స్ లొ అథ్లెటిక్స్  లొ అనేక పతకాలు సాధించిన వారు కొడి రామమూర్తి స్టేడియం లొ తయారైన వారేనని వారు గుర్తు చేశారు.  శ్రీకాకుళం జిల్లా కీర్తిప్రతిష్ఠలు ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన స్టేడియంకు ఆరు సంవత్సరాలుగా కనీసం 15  కోట్లు కేటాయించ లేదు అంటే ఈ ప్రభుత్వాలకు క్రీడల పట్ల ఉన్న శ్రద్ధ ఏమిటో అర్థమవుతుంది. స్టేడియంకు 15 కోట్లు కేటాయించకపోవడం ఇంతకన్నా సిగ్గుచేటు అంశం ఏమైనా ఉందా?  అని ప్రశ్నించారు.

Related posts

అమ్మవారిని దర్శించుకున్న భారతి స్వామీజీ

Satyam NEWS

చుక్కల భూముల సమస్యలు పరిష్కరించాలి

Bhavani

అధిక వర్షాల  పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment