40.2 C
Hyderabad
May 1, 2024 17: 44 PM
Slider హైదరాబాద్

కంటోన్మెంట్ కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణకై ఉద్యమిద్దాం

#contonment

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలోని సబ్ ఏరియాలలో దాదాపు 500 మంది కార్మికులు కాంట్రాక్టు పద్ధతిన పనిచేయుచున్నారని, ఈ కార్మికులు నిర్విరామంగా సేవలు అందిస్తున్నప్పటికీ కాంట్రాక్ట్ కార్మికులుగా కొనసాగించడం అన్యాయమని కార్మికుల్ని క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నేడు బొల్లారంలోని పబ్లిక్ గార్డెన్ నందు సబ్ ఏరియా కార్మికుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా ఉన్నదని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ దానిని ప్రభుత్వాలు అమలు చేయడం లేదని వారు విమర్శించారు. మిలటరీ సబ్ ఏరియాలలో పనిచేయుచున్న మహిళా కార్మికులకు రక్షణ లేకుండా ఉన్నదని వారు వివరించారు.

పని ప్రదేశంలో కార్మికుల బాగోగులు చూసేందుకు సూపర్వైజర్ ఉండే వ్యవస్థను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కార్మికులకు యూనిఫారం, ఐడెంటి కార్డులు తప్పక ఇవ్వాలని వారు వివరించారు. కేంద్ర లేబర్ కమిషన్ ఆదేశాల ప్రకారం కాంట్రాక్టర్లు కార్మికులకు జీతాలు సక్రమంగా చెల్లించాలని చెల్లించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు వివరించారు.

కాంట్రాక్టర్లు కార్మికులకు సక్రమంగా జీతాలు, పిఎఫ్, ఈఎస్ఐ చెల్లించేలా ముఖ్య యజమాని అయినా కంటోన్మెంట్ బోర్డు వారిని ఆదేశించడం ద్వారా కార్మికులకు న్యాయం జరుగుతుందని వారు అన్నారు. కొద్దిమంది కాంట్రాక్టర్లు కార్మికుల్ని తీసుకునే క్రమంలో వారి వద్ద నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని అలాంటి కాంట్రాక్టర్లను బ్లాక్లిస్టులో పెట్టి కార్మికులకు న్యాయం చేయాలని తద్వారా దళారీ వ్యవస్థను నిర్మూలించాలని వారి సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

 ఇక్కడ పనిచేస్తున్నటువంటి అనేకమంది కార్మికులు వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చి విధులు నిర్వహిస్తున్న ఇండ్లు లేని నిరుపేదలని వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ సబ్ ఏరియాలలో తోపాటు గోల్కొండ సబ్ ఏరియా లో పనిచేయుచున్న కార్మికులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

పిల్లలు నెట్ కు బానిసలు అయిపోతున్నారని బెంగగా ఉందా?

Satyam NEWS

బాధితులకు అండగా నిలవండి

Bhavani

గజ వాహనంపై దర్శనమిచ్చిన గోదాదేవి

Satyam NEWS

Leave a Comment