29.7 C
Hyderabad
May 2, 2024 04: 29 AM
Slider హైదరాబాద్

పిల్లలు నెట్ కు బానిసలు అయిపోతున్నారని బెంగగా ఉందా?

#TelanganaPolice

కరోనా లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది పిల్లలు ఇంటర్ నెట్ వినియోగంలో దూసుకుపోతున్నారు. చదువుకోవడానికి, ఆటలాడుకోవడానికి ఇతర విషయాలకు పిల్లలు ఇంటర్ నెట్ విరివిగా వాడేస్తున్నారు. అయితే మీకు వారి గురించి ఆందోళన కలుగుతూ ఉండి ఉంటుంది.

పిల్లలు సోషల్ మీడియాకు బానిసలు అయిపోతారేమోనని మీరు ఆందోళన చెందుతుంటారు. అదే విధంగా మీ పిల్లలు సైబర్ నేరాలలో ఇరుక్కుపోతారేమోనని కూడా మీరు ఆందోళనకు గురి అవుతూ ఉంటారు. మీ పిల్లలు సోషల్ మీడియాకు బానిసలుగా మారకుండా మీరు చేయాల్సింది ఏమిటి?

అనే అంశంపై తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం వారు సింబయాసిస్ లా స్కూల్ తో కలిసి లైవ్ సెషన్ ఏర్పాటు చేశారు. నేటి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకూ ఫేజ్ బుక్ లో ఈ లైవ్ సెషన్ ఉంటుంది. Join us on Facebook @tswomensafety

ఈ లైవ్ సెషన్ లో సైబరాబాద్ పోలీసు సైబర్ క్రైమ్స్ రోహిణి ప్రయిదర్శిని, ఉమెన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ వ్యవస్థాపకురాలు శైలజా వడ్లమూడి, సైబర్ ఫోరెన్సిక్ నిపుణుడు సెబాస్టియన్ ఎడాస్సెరీ లు పాల్గొంటారు.

నేటి సాయంత్రం 4 గంటలకు మీరు కూడా ఈ లైవ్ కార్యక్రమంలో చేరండి. మీ పిల్లలకు సైబర్ సెక్యూరిటీ ఇవ్వండి. సైబర్ ప్రపంచం గురించి తెలుసుకోండి సురక్షితంగా ఉండండి.

(తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం నుంచి సత్యం న్యూస్ కు ప్రత్యేకం)

Related posts

మెరుపు వేగంతో స్పందించి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

Satyam NEWS

మే 17 నుంచి టెన్త్ పరీక్షలు?

Sub Editor

సబ్సిడీ ధరలకు ఉల్లిపాయల అమ్మకం ప్రారంభం

Satyam NEWS

Leave a Comment