40.2 C
Hyderabad
April 28, 2024 16: 53 PM
Slider ప్రత్యేకం

కౌన్సిల్ తీర్మానానికి వ్యతిరేకంగా కన్సల్టెన్సీ ప్రతిపాదన

#gampagovardhan

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ స్పందించారు. కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ చేసిన ప్రతిపాదనలకు పూర్తిగా వ్యతిరేకంగా డిసిసి కన్సల్టెన్సీ మాస్టర్ ప్లాన్ రూపొందించిందని తెలిపారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇల్చిపూర్, టెక్రియల్, అడ్లూర్ గ్రామాల్లో మొత్తం 600 ఎకరాలను రెసిడెన్షియల్ జోన్ గా కౌన్సిల్ ప్రతిపాదిస్తే దానిని మొత్తం ఇండస్ట్రియల్ జోన్ గా మార్చారన్నారు. 132 కెవి సబ్ స్టేషన్ పక్క నుంచి లింగాపూర్ ఐరన్ ఫ్యాక్టరీ వరకు కేకేవై రోడ్డు కలిపితే రింగు రోడ్డుగా ఉంటుందని 100 ఫీట్ల రోడ్డుకు ప్రతిపాదించడం జరిగిందన్నారు.

అది కూడా ఎంట్రన్స్ నుంచి 300 మీటర్లు మాత్రమే ప్రైవేట్ వాళ్ళ నాల కన్వర్షన్ అయిందని, టవర్ లైన్ కింద అనుమతి రాకున్నా దాని కిందనే 100 ఫీట్ల రోడ్డు ప్రతిపాదన పెట్టడం జరిగిందన్నారు. ఇందులో రైతుల భూములు పోవడం లేదని స్పష్టం చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 3412 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని ఇందులో గతంలో వివిధ రంగాలకు కేటాయించగా 1777 ఎకరాలు మిగిలి ఉందన్నారు. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం ప్రకారం కాకుండా 30 నుంచి 35 రోడ్లు మార్చి కొత్త దాంట్లో చేర్చారన్నారు.

కలెక్టర్ ఆఫీస్ దగ్గర నేషనల్ హైవే ఉంటే మధ్యలోంచి 100 ఫీట్ల రోడ్డు ఇచ్చారని, మెదడున్న ఎవరైనా చేసే పనేనా ఇదని ప్రశ్నించారు. కన్సల్టెన్సీ వాళ్ళు కౌన్సిల్ తీర్మానానికి వ్యతిరేకంగా చేయడానికి వీల్లేదని, అయినా చెయ్ పంపారని చెప్పారు. ఇదంతా ప్రజలకు తెలియజేయాలని విలీన గ్రామాలతో పాటు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అభ్యంతరాలు ఇవ్వాలని కోరితే ఇప్పటిదాకా మున్సిపల్ అధికారులు తీసుకున్న దాని ప్రకారం 365 దరఖాస్తులు వచ్చాయని, ఆన్లైన్, ఇతర వాటి ద్వారా ఇప్పటివరకు మొత్తం 1365 అప్లికేషన్లు వచ్చాయన్నారు.

11 వరకు ఇంకా సమయం ఉందని, అన్ని చర్చించి ప్రభుత్వంతో మాట్లాడి కౌన్సిల్ మీటింగ్ పెట్టాకే ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. రాజకీయ పార్టీలు చెస్వ మోసపూరిత, కుట్ర పూరిత, గందరగోళ పరిస్థితుల్లో రైతులు ఇరుక్కోవద్దని కోరారు. రైతులకు ఇతర వర్గాలకు నష్టం చేసే ఆలోచన లేదని, గుంట భూమి కూడా ప్రభుత్వం తీసుకోదని, ప్రభుత్వ భూముల్లోంచి తీసుకునేలా ప్రయత్నం చేస్తామన్నారు. రైతులు ఆందోళనకు గురి కావద్దని, ఆత్మహత్యలకు, అఘాయిత్యాలకు పాల్పడవద్దని కోరారు.

ఇది కౌన్సిల్ తీర్మానానికి వ్యతిరేకంగా ప్రతిపాదించిన ముసాయిదా అని, ఇది ఫైనల్ కాదన్నారు. 2000 సంవత్సరంలో తయారు చేసిన మాస్టర్ ప్లాన్ లో 600 ఎకరాలు ఇండస్ట్రియల్ జోన్ కింద తీసుకోవడం జరిగిందని, అందులోంచి ప్రభుత్వం ఒక్క గుంట భూమి తీసుకున్నా తాను దేనికైనా సిద్ధమన్నారు. మాస్టర్ ప్లాన్ విషయంలో అధికారులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. కౌన్సిల్ తీర్మానానికి వ్యతిరేకంగా పంపిన ముసాయిదాను కేటీఆర్ ముందు పెడతామని, డిటిసిపి అధికారులపై చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోతామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని కోరారు.

Related posts

ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన

Satyam NEWS

అక్షర మాల

Satyam NEWS

నలంద కిషోర్ మరణం పోలీసులు చేసిన హత్య

Satyam NEWS

Leave a Comment