37.2 C
Hyderabad
May 6, 2024 13: 40 PM
Slider ప్రపంచం

పాక్ ఉగ్రవాదికి ఆహ్వానం: వివాదంలో మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ

#hameedansari

భారత మాజీ ఉప రాష్ట్ర పతి హమీద్ అన్సారీ పెను వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్తాన్ కు చెందిన జర్నలిస్టు, గూఢచారి నుస్రత్ మీర్జా తాను భారత్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని 2005 -2011 మధ్య కాలంలో సంపాదించానని తన వాగ్మూలంలో పేర్కొనడంతో వివాదం ప్రారంభం అయింది.

ఆ సమయంలో ఉప రాష్ట్రపతిగా ఉన్న హమీద్ అన్సారీ నుస్రత్ మీర్జాను ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానించారని, ఆ సమావేశానికి వచ్చిన నుస్రత్ మీర్జా ఈ కీలక సమాచారాన్ని సేకరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

బిజెపి ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపించింది. అయితే ఈ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయలేదని, ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదిష్‌ అగర్వాల్‌ ఏర్పాటు చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.

తనపై కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన అగర్వాల్

అయితే తనను ఈ వివాదంలోకి లాగడం సరికాదని ఆదిష్ అగర్వాల్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. తాను మోడీ జీవిత చరిత్ర పుస్తకానికి సహ రచయితగా ఉన్నందునే కాంగ్రెస్ పార్టీ తనను వివాదంలోకి లాగుతున్నదని ఆదిష్ అగర్వాల్ తెలిపారు.

అగర్వాల్ స్పందిస్తూ, అప్పటి ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ నే జర్నలిస్టు మీర్జాను పిలవాలని కోరుకున్నారని, అయితే తనను పిలవలేదని వివరణ ఇచ్చారు. తాను పిలకవకపోవడంతో అప్పటి ఉపరాష్ట్రపతి దాని గురించి ఎంతో బాధపడ్డారని అన్నారు. మాజీ రాష్ట్రపతి హమీద్ అన్సారీపై డాక్టర్ అగర్వాల్ చేసిన తాజా వాదనకు శుక్రవారం బీజేపీ మద్దతు తెలిపింది.

అంతర్జాతీయ ఉగ్రవాదం మరియు మానవ హక్కులపై తాను అంతర్జాతీయ న్యాయనిపుణుల సమావేశాన్ని తాను 2010 డిసెంబర్ 11 మరియు 12 తేదీల్లో విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించినట్లు ఆదిష్ తెలిపారు. అయితే మరొక సమావేశం గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం లేదని ఆయన అన్నారు.

‘‘నేను నిర్వహించిన సదస్సులో పాక్ జర్నలిస్టు పాల్గొనలేదు’’

తాను నిర్వహించిన సదస్సులో మీర్జా పాల్గొన్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని అగర్వాల్ అన్నారు. ఇది తప్పు. ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మకథకు సహ రచయిత అనే కారణంతో కాంగ్రెస్ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ నేతలు నాపై బాధ్యతారాహిత్య ప్రకటనలు చేస్తున్నారు.

రి కార్డుల ఆధారంగా వాస్తవాలను స్పష్టం చేయాలనుకుంటున్నట్లు అగర్వాల్ తన ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ ఉగ్రవాదం మరియు మానవ హక్కులపై న్యాయనిపుణుల అంతర్జాతీయ సదస్సు 2010 డిసెంబర్ 11 మరియు 12 తేదీల్లో విజ్ఞాన్ భవన్‌లో జరిగింది.

అప్పటి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఈ సమావేశానికి హాజరయ్యారు. కానీ నుస్రత్ మీర్జా ఆహ్వానితుడు కాదు లేదా హాజరుకాలేదు. నుస్రత్ మీర్జా కూడా తన ఇంటర్వ్యూలో ఈ సదస్సు గురించి ప్రస్తావించలేదు. హమీద్ అన్సారీ భారత ఉపరాష్ట్రపతిగా ఉన్నందున ఈ సమావేశానికి ఆహ్వానించబడ్డారు.

అప్పటి ఉప రాష్ట్రపతి సచివాలయంలో డైరెక్టర్‌గా ఉన్న అశోక్ దివాన్, నుస్రత్ మీర్జాను సదస్సుకు ఆహ్వానించాలని అన్సారీ కోరారు. మీర్జా మీడియా నుండి వచ్చినందున, పాకిస్తాన్ నుండి న్యాయమూర్తులు మరియు న్యాయవాదులను సమావేశానికి ఆహ్వానించలేదని, అన్సారీ అభ్యర్థనను తిరస్కరించినట్లు అగర్వాల్ పేర్కొన్నారు.

మీర్జాను పిలవనందుకు ఉపరాష్ట్రపతి మనస్తాపానికి గురయ్యారని, కాన్ఫరెన్స్‌కు ఒకరోజు ముందు దివాన్‌ తనకు ఫోన్ చేశారని, అంతకుముందు గంటసేపు ఉంటానని చెప్పిన అన్సారీ తర్వాత కేవలం 20 నిమిషాలు మాత్రమే సమావేశానికి హాజరయ్యారని చెప్పారు.

తర్వాత కాన్ఫరెన్స్‌కి వచ్చినప్పుడు దీవాన్‌ చెప్పినట్లుగా కేవలం 20 నిమిషాల్లోనే తిరిగొచ్చారు. ఈ సందర్భంలో అగర్వాల్ ప్రకటనను బీజేపీ సమర్థించింది. అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా శుక్రవారం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని, హమీద్ అన్సారీని బీజేపీ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా అన్సారీ జీ మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వంపైనే పెట్టారని అన్నారు.

పాకిస్థానీ జర్నలిస్ట్ నుస్రత్ మీర్జా చెప్పిన దాని ప్రకారం తనను హమీద్ అన్సారీ చాలాసార్లు భారతదేశానికి ఆహ్వానించారు. ఇక్కడి నుంచి తిరిగి రాగానే పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి భారత్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్ని అందించాడు.

అన్సారీ ఈ ఆరోపణలను అబద్ధాలుగా పేర్కొన్నారు. తాను ఎవరినీ ఆహ్వానించలేదని అన్సారీ అన్నారు. వైస్ ప్రెసిడెంట్ ద్వారా విదేశీ ప్రముఖులకు ఆహ్వానాలు సాధారణంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఇస్తారు.

Related posts

చిన్న కుటుంబం చింతలేని కుటుంబం

Satyam NEWS

సీఎం ప‌ర్య‌ట‌న ఏర్పాట్లు ముమ్మ‌రం..

Sub Editor

ఏప్రిల్ 14 నుంచీ రెండో సారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్ర

Satyam NEWS

Leave a Comment