30.7 C
Hyderabad
April 29, 2024 03: 48 AM
Slider ప్రత్యేకం

150 పడకల ఆసుపత్రిని 100 పడకలుగా చేస్తారా?

#jupally

మూడు సంవత్సరాల క్రితం… అంటే 2018 సంవత్సరంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు వైద్యపరంగా అందరికి అందుబాటులో ఉండేందుకు 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంజూరు చేయించారు. 50 పడకల మాతాశిశు ఆసుపత్రిని వంద పడకల జనరల్ ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయించారు.

దీనిపై అప్పటి ప్రభుత్వం GO జారీ చేయగా ఆనాటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ని తీసువచ్చిన జూపల్లి శంకుస్థాపన చేయించిన విషయం విదితమే.

ఈ నేపథ్యంలో రామాపురం గ్రామ శివారులో 50 పడకల ఆసుపత్రి ఎన్నో అడ్డంకుల నడుమ పూర్తయిన సందర్భంలో మంగళవారం  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు  ప్రారంభించారు. ఈ సందర్భంగా బుధవారం ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, జూపల్లి యువసేన కార్యకర్తలతో కలిసి  ఆస్పత్రిని సందర్శించారు.

స్థానిక వైద్య సిబ్బంది తో కలిసి ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జూపల్లి  మాట్లాడుతూ తాను మంత్రిగా ఉన్న నాడు ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అందరికీ అనువుగా ఈ ఆసుపత్రి ఏర్పాటు చేయించినట్లు చెప్పారు. 

రైతులు త్యాగం చేసి భూమి ఇచ్చారు

రామాపురం శివారులోని రైతులు సాగు చేసుకుంటున్న 32 ఎకరాల ప్రభుత్వ భూమిని  వారిని ఒప్పించి సేకరించడం జరిగిందన్నారు. 50 పడకలతో పాటు వంద పడకల ఆసుపత్రి కూడా మంజూరై ఉన్నా నేటి వరకు టెండర్లకు పిలవకపోవడంలో ఆంతర్యమేమిటో  తెలియజేయాలన్నారు. 50 పడకల తో పాటు ఆ వంద పడకల ఆసుపత్రి కూడా పనులు ప్రారంభం అయితే నియోజకవర్గ ప్రజలకు వైద్యపరంగా ఏలాంటి ఇబ్బందులు ఉండవని వ్యక్తం చేశారు.

50 పడకలుగా ఉన్న మాతాశిశు ఆసుపత్రిని మరో 100 పడకలు పెంచుతామని మంత్రి ప్రకటించడం సంతోషించదగ్గ పరిణామమెన్నారు. కానీ ఇదివరకే మంజూరై ఉన్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి  టెండర్లకు పిలిచి రెండు కలిపి 200 పడకల ఆస్పత్రిగా చేస్తారా? లేక ఈ 50 పడకలు పెంచి 100 పడకల వరకే కుదిస్తారా అన్నది స్పష్టం చేయాలన్నారు.  ఈ అంశం పై మంత్రికి వివరిస్తానన్నారు.

డాక్టర్లకు సిబ్బందికి శుభాకాంక్షలు

నూతన ఆసుపత్రి లో విధులు నిర్వహించబోతున్నా డాక్టర్లకు వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. వారితో పాటు కొల్లాపూర్ పట్టణానికి చెందిన వివిధ వార్డుల కౌన్సిలర్లు నరసింహారావు, మేకల రమ్య నాగరాజు, మేకల శిరీష కిరణ్ యాదవ్,శ్రీ లక్ష్మి వేణు, రహీం, నయిం, మాచు పల్లి బాలస్వామి,మాజీ సర్పంచ్ బచ్చల కూరా బాలరాజు, టిఆర్ఎస్ పార్టీ  నాయకులు,జూపల్లి అనుచరులు మేకల కిషోర్ యాదవ్, రమేష్ ముదిరాజ్,సత్యం,సన్ని, వెంకటేష్ పశుల,వెంకటేష్ యాదవ్, కేతూరి ధర్మ తేజా, ఎక్బాల్,కళ్ళు శివ  తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

ప్రకాశం జిల్లా జిల్లాలో రాజీనామాల పర్వం

Satyam NEWS

పుకార్లు నమ్మవద్దు..పుకార్లు పుట్టించవద్దు…

Satyam NEWS

అసమ్మతితో అజ్ఞాతంలోకి జోగు రామన్న?

Satyam NEWS

Leave a Comment