29.7 C
Hyderabad
April 29, 2024 08: 28 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తి మునిసిపాలిటిలో అవినీతి ఆధారాలతో నిరూపిస్తా

#wanaparthymunicipality

వనపర్తి మున్సిపాలిటీలో జరిగిన అవినీతి ఆధారాలతో ఆడియో ద్వారా నిరూపిస్తానని అఖిల పక్షం ఐక్య వేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ చెప్పారు. వనపర్తిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంపాదనే ధ్యేయంగా  పని చేస్తే ప్రజల నుండి తిరస్కారం తప్పదన్నారు. గత రెండు సంవత్సరాలుగా ప్రజల కోసం, ప్రజల ఆస్తులు కాపాడడానికి మాత్రమే పనిచేస్తున్న అఖిలపక్ష ఐక్యవేదికపై అవాకులు చెవాకులు మాట్లాడారని విమర్శించారు.

రాజ్యాంగం కల్పించిన హక్కులతో వనపర్తిలో సంస్కారహితంగా సామాజిక సేవ చేస్తూ ప్రజల కోసమై పోరాడుతున్నామని చెప్పారు. అంతేగాని మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలు అవినీతిని బైటకు తీసినంత మాత్రాన అదుపుతప్పి మాపై అంతు చూస్తాము ఖబర్దార్ వంటి మాటలతో  స్థాయి తగ్గించుకోవద్దని హితవు పలికారు. వనపర్తిలో రెండు కోట్లు ఖర్చుపెట్టి గెలిచారని, పది కోట్లు సంపాదించు కోవాలనీ ఒకరు, ఐదు కోట్లు సంపాదించి వచ్చేసారి చైర్మన్ కావాలని ఒకరు పోటీ పడుతున్నట్లు ఉందని ప్రజలు చర్చించు కుంటున్నారని తెలిపారు. ఎవరు అవినీతి చేస్తున్నారో ప్రజలు గుర్తుపట్టారని చెప్పారు.

ప్రభుత్వమే ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసిందనీ తెలియదా అని ప్రశ్నించారు. ప్రజావాణిలో తిట్లు తిన్న వారు ఒకరు, అధినాయకులతో తిట్లుతిన్నవారు ఒకరు,  కలిసి  మమ్మల్ని తిట్టడానికి  ప్రెస్ మీట్ పెట్టారని చెప్పారు.

ప్రజల కోసం పోరాడుతున్న మాపై   తిట్లతో దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. భారతరాజ్యాంగం కల్పించిన హక్కులను కాల రాయాలని చూస్తున్న ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.   పాలిటెక్నిక్ లో చెట్లు అమ్ముకున్నారని విమర్శించారు. బతుకమ్మ చీరలు టైలర్ షాప్ లో పెట్టి అమ్ముకున్నారి గురించి, కరోనా టైంలో మంత్రి ఇచ్చిన బియ్యాన్ని ప్రజలకు ఇవ్వకుండా అమ్ముకున్నారని, వారి వివరాలను బయటపెడతామని తెలిపారు. అంతేగాకుండా వనపర్తి మున్సిపాలిటీలో జరిగిన అవినీతిని బయట పెడతామని  సతీష్ యాదవ్, చిరంజీవి చెప్పారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, జానంపేట రాములు, పొట్టినేని గోపాలకృష్ణ నాయుడు, గౌస్ పాషా పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

5 సంవత్సరాలలో గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా

Satyam NEWS

టెలిఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర సంస్థలతో ఆడిట్ కి సిద్ధమా?

Satyam NEWS

ప్రముఖ ర‌చ‌యిత ప‌తంజలి జ‌యంతి సంద‌ర్బంగా సాహిత్య పుర‌స్కారం

Satyam NEWS

Leave a Comment