Slider నల్గొండ

గుడ్ వర్క్: నాయీ బ్రాహ్మణ పేద కుటుంబాలకు ఆసరా

#Chityala Municipality

నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో నేడు మున్సిపల్ కౌన్సిలర్ జడల పూలమ్మ చిన్న మల్లయ్య పేద నాయి బ్రాహ్మణ కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి చొప్పున ఐదు కిలోల బియ్యం కూరగాయలు పంపిణీ  చేశారు.

కష్టకాలంలో రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద నాయీబ్రాహ్మణ కుటుంబాలను ఆదుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ జడల పూలమ్మ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్  విధించిన తరువాత రెక్కాడితే గాని డొక్కాడని నాయీ బ్రాహ్మణ కుటుంబాలు మొత్తం వీధిన పడ్డాయని, అలాంటి పేద కుటుంబాలను ఆదుకున్నామని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్ననాయి బ్రాహ్మణ పేద కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం మండల పట్టణ  అధ్యక్షులు  అమరోజు వెంకటేశం అంశాల శ్రవణ్  నాయీ బ్రాహ్మణ జిల్లా ఉపాధ్యక్షుడు చికిలంమెట్ల అశోక్ పట్టణ ప్రధాన కార్యదర్శి అమరోజు శ్రీరాములు మునుగోటి మహేష్ వావిల్ల కృష్ణయ్య వేముల మచ్చ గిరి తదితరులు పాల్గొన్నారు.

Related posts

తితిదే బోర్డు సభ్యుల నియామకాలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌

Satyam NEWS

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చిత్తశుద్ధితో పని చేయాలి

mamatha

ఓటు వేసే అవకాశం కోల్పోయిన రాజగోపాల్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment